Pawan Kalyan : పవన్ కళ్యాణ్ లేకుంటే టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చేవి కాదా.. ఇదేం లెక్క..?
Pawan Kalyan : టీడీపీకి ఎంతో చరిత్ర ఉంది. తెలుగు రాజకీయాల్లో లోకల్ పార్టీ అంటే అందరికీ ముందుగా టీడీపీనే గుర్తుకొస్తుంది. ఆ పార్టీనే ఎన్నో లోకల్ పార్టీలు పుట్టడానికి కారణం అయింది. చంద్రబాబు ఆ పార్టీ తరఫున మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత చేసిన ఆ పార్టీకి ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఇంకా ఘోరమైన ఫలితాలను చూస్తాడని అంతా అనుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు మొత్తం నైరాశ్యంలో దిక్కు ధీము లేని వారిలా ఉన్నారు. అప్పుడు వచ్చాడు పవన్ కల్యాణ్.
జైలుకు వెల్లి చంద్రబాబును కలిసి పరామర్శించారు. బయటకు వచ్చి టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుందని తెలిపారు. దాంతో టీడీపీలో ఓ వెలుగు వచ్చింది. ఎక్కడలేని జోష్ కనిపించింది. ఎందుకంటే పవన్ సాధారణమైన వ్యక్తి కాదు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. క్రౌడ్ పుల్లర్, ఫుల్ గ్లామర్ ఉన్న హీరో. అలాంటి వ్యక్తి మద్దతు ఇవ్వడంతో టీడీపీ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అన్ని వర్గాలు వైసీపీకే మద్దతు తెలుపున్న సమయంలో టీడీపీకి పవన్ సపోర్ట్ ఇవ్వడంతో ఏపీలో 18 శాతం ఉన్న కాపులు, తూర్పు కాపులు, బలిజలు అంతా కూడా టీడీపీ కూటమి గొడుగు కిందకు వచ్చారు.
వీరంతా టీడీపీకి బలమైన ఓటు బ్యాంకులా మారిపోయారు. మొదట్లో పవన్ ను వారంతా వ్యతిరేకించారు. ఎందుకంటే జనసేనకు 21 సీట్లు మాత్రమే టీడీపీ ఇచ్చిందని దాన్ని పవన్ పుచ్చేసుకున్నారు అని. కానీ పవన్ కల్యాణ్ ను జగన్ వ్యక్తిగతంగా విమర్శించడంతో వారంతా వైసీపీకి వ్యతిరేకంగా మారి టీడీపీ కూటమి వైపు నిలబడ్డారు. బీసీలు వైసీపీ వైపు వెళ్తున్న సమయంలో కాపులు వచ్చి అండగా నిలిచారు. అంతే కాకుండా వైసీపీ అనుకూల ఓటు అటు షర్మిల కారణంగా చీలిపోతోంది. దాంతో పాటు అటు కేంద్రంలోని బీజేపీ సపోర్టు కూడా దొరికేలా చేశారు పవన్.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ లేకుంటే టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చేవి కాదా.. ఇదేం లెక్క..?
పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబుతో బీజేపీ పొత్తులకే ఓకే చెప్పింది. ఇలా పవన్ మద్దతు, బీజేపీ అండ దొరకడంతో టీడీపీ వైపు ప్రజలు చూస్తున్నారు. అంతే గానీ పవన్ లేకపోతే మాత్రం టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చేవి కాదని విశ్లేషకులు చెబతున్నారు. చూడాలి మరి ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు టీడీపీ కూటమి గెలుస్తుందో.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.