Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లేకుంటే టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చేవి కాదా.. ఇదేం లెక్క‌..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లేకుంటే టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చేవి కాదా.. ఇదేం లెక్క‌..?

 Authored By ramu | The Telugu News | Updated on :18 May 2024,9:00 pm

Pawan Kalyan : టీడీపీకి ఎంతో చరిత్ర ఉంది. తెలుగు రాజకీయాల్లో లోకల్ పార్టీ అంటే అందరికీ ముందుగా టీడీపీనే గుర్తుకొస్తుంది. ఆ పార్టీనే ఎన్నో లోకల్ పార్టీలు పుట్టడానికి కారణం అయింది. చంద్రబాబు ఆ పార్టీ తరఫున మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత చేసిన ఆ పార్టీకి ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఇంకా ఘోరమైన ఫలితాలను చూస్తాడని అంతా అనుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు మొత్తం నైరాశ్యంలో దిక్కు ధీము లేని వారిలా ఉన్నారు. అప్పుడు వచ్చాడు పవన్ కల్యాణ్‌.

Pawan Kalyan : వారంతా టీడీపీకే మద్దతు..

జైలుకు వెల్లి చంద్రబాబును కలిసి పరామర్శించారు. బయటకు వచ్చి టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుందని తెలిపారు. దాంతో టీడీపీలో ఓ వెలుగు వచ్చింది. ఎక్కడలేని జోష్ కనిపించింది. ఎందుకంటే పవన్ సాధారణమైన వ్యక్తి కాదు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. క్రౌడ్ పుల్లర్, ఫుల్ గ్లామర్ ఉన్న హీరో. అలాంటి వ్యక్తి మద్దతు ఇవ్వడంతో టీడీపీ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అన్ని వర్గాలు వైసీపీకే మద్దతు తెలుపున్న సమయంలో టీడీపీకి పవన్ సపోర్ట్ ఇవ్వడంతో ఏపీలో 18 శాతం ఉన్న కాపులు, తూర్పు కాపులు, బలిజలు అంతా కూడా టీడీపీ కూటమి గొడుగు కిందకు వచ్చారు.

వీరంతా టీడీపీకి బలమైన ఓటు బ్యాంకులా మారిపోయారు. మొదట్లో పవన్ ను వారంతా వ్యతిరేకించారు. ఎందుకంటే జనసేనకు 21 సీట్లు మాత్రమే టీడీపీ ఇచ్చిందని దాన్ని పవన్ పుచ్చేసుకున్నారు అని. కానీ పవన్ కల్యాణ్‌ ను జగన్ వ్యక్తిగతంగా విమర్శించడంతో వారంతా వైసీపీకి వ్యతిరేకంగా మారి టీడీపీ కూటమి వైపు నిలబడ్డారు. బీసీలు వైసీపీ వైపు వెళ్తున్న సమయంలో కాపులు వచ్చి అండగా నిలిచారు. అంతే కాకుండా వైసీపీ అనుకూల ఓటు అటు షర్మిల కారణంగా చీలిపోతోంది. దాంతో పాటు అటు కేంద్రంలోని బీజేపీ సపోర్టు కూడా దొరికేలా చేశారు పవన్.

Pawan Kalyan ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లేకుంటే టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చేవి కాదా ఇదేం లెక్క‌

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లేకుంటే టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చేవి కాదా.. ఇదేం లెక్క‌..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వల్లే చంద్రబాబుతో బీజేపీ పొత్తులకే ఓకే చెప్పింది. ఇలా పవన్ మద్దతు, బీజేపీ అండ దొరకడంతో టీడీపీ వైపు ప్రజలు చూస్తున్నారు. అంతే గానీ పవన్ లేకపోతే మాత్రం టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చేవి కాదని విశ్లేషకులు చెబతున్నారు. చూడాలి మరి ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు టీడీపీ కూటమి గెలుస్తుందో.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది