7th Pay Commission
Viral News : ఈ రోజుల్లో చాలా మంది ఈజీగా సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నారు. కొంత మంది కష్టపడి పైకి వస్తుంటే.. ఇంకొందరు మాత్రం కష్టం లేకుండానే కోటీశ్వరులు అయిపోవాలని ఆశపడుతున్నారు. ఇలా జరగాలంటే వారి లైఫ్ లో ఏదో ఒక మిరాకిల్ జరగాలి. వారు లాటరీలో కోట్లు అయినా పొందాలి. లేదంటే వారి అకౌంట్ లో ఎవరైనా కోట్లు డిపాజిట్ చేయాలి. ఇలాంటివి జరగాలంటే ఎంతో రాసిపెట్టి ఉండాలి కదా. అయితే ఇప్పుడు ఓ స్టూడెంట్ విషయంలో ఇలాంటిదే జరిగింది. అనుకోకుండా ఆమె ఖాతాలో రూ.6 కోట్లు డిపాజిట్ అయ్యాయి. కానీ చివరకు పెద్ద ట్విస్ట్ ఏర్పడింది.
దక్షిణాఫ్రికాలోని వాల్టర్ సిసులు యూనివర్సిటీ(WSU)లో సిబొంగిలే మణి అనే యువతి చదువుకుంటోంది. అప్పటికి ఆమె వయసు 32 ఏళ్లు. అయితే ఆమె మధ్యతరగతికి చెందిన అమ్మాయి. ఆమె చదువు ఫీజులు చెల్లించడానికి కూడా ప్రభుత్వ పథకాలపై ఆధారపడేది. సాధారణంగా ఆహార అవసరాలకు కూడా ప్రభుత్వమే ఆమె ఖాతాలో డబ్బులు వేసేది. ఇలా ప్రతి నెలా ఆమె అవసరాల కోసం దాదాపు $100 (సుమారు రూ.8,300) వేసేది ప్రభుత్వం. కానీ ఒకసారి అనుకోకుండా ఆమె ఖాతాలో 14 మిలియన్ ర్యాండ్ ($768363.26 లేదా సుమారు రూ.6 కోట్లు) జమ అయ్యాయి.
ఇవి పొరపాటును అయ్యాయని ఆమెకు తెలుసు. కానీ తిరిగి ఇవ్వకుండా జల్సాలు చేయాలని డిసైడ్ అయింది. ఫ్యాషన్ వేర్ డ్రెస్ లు కొనుక్కుంది. లగ్జరీ కారు కొనుక్కుంది. లేటెస్ట్ ఐఫోన్, ఖరీదైన మద్యం బాటిళ్లను కొనుగోలు చేసింది. దాంతో పాటు ఫ్రెండ్స్ కు పార్టీలు ఇచ్చింది. కొన్ని రోజులు బాగానే నడిచింది. కానీ ఆమె సూపర్ మార్కెట్ లో వదిలేసిన బ్యాంక్ రిసిప్ట్ ద్వారా దొరికిపోయింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సిబొంగిలే మణి 2017లో అరెస్టు కాగా, 2022లో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఆమె ఆ డబ్బులను కావాలని తీసుకోలేదని ఆమె తరపు లాయర్ వాదించారు.
7th Pay Commission
అనుకోకుండా జమ అయ్యాయి కాబట్టే ఖర్చు చేసింది తప్ప ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని తెలిపారు. ఆ డబ్బులను ‘గిఫ్ట్ ఫ్రమ్ గాడ్’గా భావించాననిసిబొంగిలే కోర్టుకు తెలిపింది. దాంతో ఆమెకు ఐదేళ్ల శిక్షను కోర్టు రద్దు చేసింది. కానీ సమాజానికి సేవ చేయాలని ఆర్డర్ వేసింది. కానీ ఖర్చు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని మాత్రం చెప్పలేదు కోర్టు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.