Mark Shankar : పవన్ కుమారుడు మార్క్ శంకర్ ను కాపాడింది వీరే !
ప్రధానాంశాలు:
Mark Shankar : పవన్ కుమారుడు మార్క్ శంకర్ ను కాపాడింది వీరే !
Mark Shankar : సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. Janasena Party జనసేన పార్టీ అధినేత, Andhra pradesh ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్‌లో ఉన్న ‘టమాటో కుకింగ్ స్కూల్’ అనే విద్యా సంస్థలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన జరుగుతున్న సమయంలో 20 మంది విద్యార్థులు అక్కడ ఉండగా, మార్క్ శంకర్ కూడా వారిలో ఉన్నారు. మంటల్లోనుండి గాయాలతో బయటపడిన మార్క్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్టు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.

Mark Shankar : పవన్ కుమారుడు మార్క్ శంకర్ ను కాపాడింది వీరే !
Mark Shankar పవన్ కొడుకును కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్ ప్రభుత్వం
ఈ ప్రమాద సమయంలో అక్కడే ఉన్న నలుగురు భారతీయ వలస కార్మికులు ఇందర్‌జిత్ సింగ్, సుబ్రహ్మణ్యం శరణ్‌రాజ్, నాగరాజన్ అన్బరాసన్, శివస్వామి విజయ్‌రాజ్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చిన్నారులను కాపాడేందుకు రంగంలోకి దిగారు. నిచ్చెనల సహాయంతో మూడో అంతస్తుకు చేరి, పిల్లల అరుపులను వినగానే, పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్షణాల్లో 10 మంది పిల్లలను అలాగే మార్క్ శంకర్‌ను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. వీరి సహకారంతో మరిన్ని ప్రాణాలు రక్షించబడ్డాయి.
ఈ నలుగురి సహసానికి గుర్తింపుగా సింగపూర్ ప్రభుత్వం వారిని సత్కరించింది. మ్యాన్‌పవర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అస్యూరెన్స్, కేర్ అండ్ ఎంగేజ్‌మెంట్ గ్రూప్ వారు “ఫ్రెండ్స్ ఆఫ్ ఏస్” రివార్డుతో వీరిని గౌరవించింది. వారి సహసంతో మార్క్ శంకర్ మాత్రమే కాకుండా పలువురు పిల్లలు ప్రాణాలతో బయటపడటంతో ఈ ఘటనలో భారతీయుల గొప్ప సేవాభావం మరోసారి చాటుకుంది.