YS Jagan : సీఎం ఆఫీస్ కి పిలిపించిన ఎమ్మెల్యేలకు జగన్ చెబుతున్న మొదటి మాట ఇదే ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : సీఎం ఆఫీస్ కి పిలిపించిన ఎమ్మెల్యేలకు జగన్ చెబుతున్న మొదటి మాట ఇదే ..!

 Authored By anusha | The Telugu News | Updated on :22 December 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : సీఎం ఆఫీస్ కి పిలిపించిన ఎమ్మెల్యేలకు జగన్ చెబుతున్న మొదటి మాట ఇదే ..!

YS Jagan : వైయస్సార్ సీపీ పార్టీలో రాజకీయం ఉత్కంఠ భరితంగా మారుతుంది. నేరుగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్ద పెట్టాల్సిన అవసరం వచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నారు. గెలుపే ప్రామాణికమని చెబుతూ వస్తున్నారు. సీటు నిరాకరిస్తున్న వారి భవిష్యత్తు మీద ఆయన హామీ కూడా ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడం కోసమే ఈ నిర్ణయాలు తప్పట్లేదని చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కసరత్తును వేగవంతం చేశారు. ఎక్కడైతే సెట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను సర్వేలు చేపించి వారిని మార్చేందుకు నిర్ణయించారు. ఇప్పటికే 11 నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేశారు. మరో జాబితా సిద్ధంగా ఉంది.

అందులో భాగంగా గోదావరి గుంటూరు జిల్లాల నుంచి సీఎం పిలుపు రావడంతో గోదావరి జిల్లాలోని పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, చింతలపూడి, రామచంద్రాపురం ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. ఎవరికి ఏ కారణంతో టికెట్ నిరాకరిస్తున్నది సీఎం జగన్ వివరించి మరి వాళ్ళకి చెబుతున్నారు. వారి స్థానంలో నియమించే వారికి సమాచారం అందిస్తున్నారు. సహకరించాలని కూడా కోరుతున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తానని వాళ్లకు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారు మీద మొదటి నుంచి వరుసగా మూడు రోజులు సమావేశాలు నిర్వహించారు. వచ్చేవారం ఎంపీలతో సమావేశం కానున్నారు.

ఏ క్షణంలోనైనా ఇన్ ఛార్జిల మార్పు మీద అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగ గీతకు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా బాధ్యతలు స్వీకరింపు ఖాయం అయింది. దీనికి సంబంధించి గీతకు క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. కాకినాడ ఎంపీ స్థానం రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యేలను మార్చడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రత్తిపాడు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పూర్ణచంద్రరావు స్థానంలో పర్వతనేని జానకిదేవిని ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది