Tadipatri : ఈ సారి తాడిప‌త్రి పోరు ఓ రేంజ్‌లో.. పెద్దారెడ్డి గెలుస్తాడా..? జేసీ అస్మిత్ రెడ్డి పుంజుకుంటాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tadipatri : ఈ సారి తాడిప‌త్రి పోరు ఓ రేంజ్‌లో.. పెద్దారెడ్డి గెలుస్తాడా..? జేసీ అస్మిత్ రెడ్డి పుంజుకుంటాడా..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Tadipatri : ఈ సారి తాడిప‌త్రి పోరు ఓ రేంజ్‌లో.. పెద్దారెడ్డి గెలుస్తాడా..? జేసీ అస్మిత్ రెడ్డి పుంజుకుంటాడా..!

Tadipatri : అనంతపురం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ర‌స‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశం ఉంది. రసకందాయంగా మారుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాపై తన పట్టు మరింత పెంచుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం కూడా ఎత్తుల‌కి పై ఎత్తులు వేస్తుంది. అయితే ఈ క్ర‌మంలోనే ఈ రెండు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నందున- ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు.

Tadipatri : ఎవరిది గెలుపు…

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ఒక‌టి. ఈ జిల్లాలో ఉన్న మొత్తం 13 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో 11 చోట్ల వై ఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది. ఉన్న రెండు లోక్ సభ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అనంతపురం నుంచి తలారి రంగయ్య, హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ ఘన విజయం సాధించ‌గా, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గెలిచారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వరకూ రాయ‌లసీమ‌ జేసీ బ్రదర్స్ అడ్డా. కానీ ఆ పేరును పెద్దారెడ్డి చెరిపేశారు. జేసీ సోదరులకు ఇక్కడ ఏమీ లేదని నిరూపించారు. ఐదేళ్లలో తనను తాను నాయకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు పెద్దారెడ్డి.

Tadipatri ఈ సారి తాడిప‌త్రి పోరు ఓ రేంజ్‌లో పెద్దారెడ్డి గెలుస్తాడా జేసీ అస్మిత్ రెడ్డి పుంజుకుంటాడా

Tadipatri : ఈ సారి తాడిప‌త్రి పోరు ఓ రేంజ్‌లో.. పెద్దారెడ్డి గెలుస్తాడా..? జేసీ అస్మిత్ రెడ్డి పుంజుకుంటాడా..!

సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే తనను గెలిపించాలని ఆయన ఇంటింటికీ తిరుగుతున్నారు.మరోవైపు గత ఎన్నికల్లో ఓటమి బాధతో కసితో ఉన్న జేసీ ఫ్యామిలీ ఈసారి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడైన అస్మిత్ రెడ్డిని బరిలోకి దించింది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన సానుభూతితో పాటు జేసీ బ్రదర్స్ కుటుంబానికి ఉన్న పట్టు కూడా తన గెలుపునకు ఉపయోగపడుతుందని అస్మిత్ రెడ్డి భావిస్తున్నారు. పెద్దారెడ్డితో పోలిస్తే తాను యువకుడిని కావడంతో తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారు. జేసీ కుటుంబానికి ఈ ఎన్నికల్లో ఒకే సీటు రావడం… అదీ తాడిపత్రి కావడంతో అందరూ తాడిపత్రిపైనే ఫోకస్ పెట్టారు. తలా ఒక దిక్కుకు వెళ్లి ప్రచారాన్ని చేస్తున్నారు. మ‌రి ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తారా అనేది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది