YS Jagan : సీఎం జగన్ ఫోటో కనిపించడం కోసం ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్స్ లేపేశారు.. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
జగన్ ఫోటో కనిపించడం కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ తీసేశారు
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇంత దారుణమా.. మండిపడుతున్న నెటిజన్లు
YS Jagan : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలన్నీ వైసీపీ, టీడీపీ మధ్యనే జరుగుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. వచ్చే సంవత్సరం మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి ప్రస్తుతం ఎన్నికల గురించి పెద్దగా జనాలు కూడా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అందరి చూపు తెలంగాణ మీద ఉంది. తెలంగాణ ఎన్నికలు పూర్తయితే కానీ.. ఇక అందరూ ఏపీ రాజకీయాల మీద పడరు. ఇదంతా ఓకే కానీ.. ప్రస్తుతం ఏపీలో ఏపీలో వైసీపీ పార్టీ దూసుకుపోతోంది. తొలిసారి అధికారంలోకి వచ్చినా కూడా ఏపీలో చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి సీఎం జగన్ ఏపీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఏపీని బాగానే అబివృద్ధి చేస్తున్నాం. మరోసారి గెలిపించి మీ మద్దతు తెలపాలని సీఎం జగన్ ఏపీ ప్రజలను కోరుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపించి ఏపీలో తమకు అడ్డు, అదుపు లేదని చెప్పకనే చెబుతున్నారు. ఉన్న ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా డౌన్ అయిపోతోంది. చంద్రబాబు అరెస్ట్ కావడంతో టీడీపీకి చాలా మైనస్ అయిపోయింది. అది వైసీపీకి ప్లస్ అయింది. ఎన్నికల వేళ చంద్రబాబు అరెస్ట్ కావడంతో వైసీపీ నేతలు సంబురాలు చేసుకున్నారు. ఇక.. అసలు విషయం ఏంటంటే తాజాగా ఏపీలో సీఎం జగన్ హోర్డింగ్ పెట్టారు. ఆ హోర్డింగ్ కి పక్కనే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ బోర్డ్స్ అడ్డంగా ఉన్నాయి. దీంతో సీఎం జగన్ ఫోటో కనిపించడం లేదు. అంటే ఆయన ముఖం అడ్డంగా ఉండటంతో రోడ్డు మీద వెళ్తున్న జనాలకు ఆయన ముఖం కనబడలేదు.
YS Jagan : వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ తొలగించిన సిబ్బంది
ఈ విషయం ఎలా వైసీపీ నేతలకు తెలిసిందో కానీ.. వెంటనే సీఎం జగన్ కు అడ్డుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ను వెంటనే తీసేయించారు. జగన్ హోర్డింగ్ కు అడ్డుగా ఉందని ట్రాఫిక్ సిగ్నల్స్ ను వెంటనే తీసేయడంతో అప్పుడు కానీ.. జగన్ ఫోటో సరిగ్గా కనిపించలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ ముఖం కనిపించడం కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ నే లేపేస్తారా? ఇదెక్కడి అన్యాయం అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
