ys jagan జగన్ మొదలెట్టాడు ఊచకోత – వరస పెట్టి ఏకగ్రీవాలు !
ys jagan : గత ఏడాది ఆరంభంలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. పక్రియ ప్రారంభం అయిన తర్వాత ఎన్నికలు రెండు మూడు రోజుల్లో ఉండగా కరోనా కారణంగా ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను క్యాన్సిల్ నిర్ణయాన్ని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ ప్రకటించాడు. ఎన్నికల వాయిదా విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అప్పటి నుండి నిమ్మగడ్డ రమేష్ పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోపంతో ఉన్నారు. ఎన్నికలు క్యాన్సిల్ చేస్తున్నట్లుగా చెప్పడానికి ముందు వైకాపా భారీ ఎత్తున ఏకగ్రీవాలు చేసింది. వందల కొద్ది ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ లను ఏకగ్రీవం చేయడం వల్ల ఎన్నికలు వైకాపాకు చాలా సులభం అయ్యింది. పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేశారు అంటూ వైకాపా నాయకులపై విమర్శలు వచ్చాయి. ఆ విషయమై ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది.
పోయిన సారి జరిగినట్లుగా ఈసారి చేయకూడదు అనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ విషయమై కఠినంగా వ్యవహరించాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశౄలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి వైకాపా నాయకులు ఏకగ్రీవాలకు పాల్పడే అవకాశం తక్కువగా ఉంటుందని, గత ఏడాది కంటే ఈ ఏడాది తక్కు ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉందంటున్నారు. కాని జగన్ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏకగ్రీవాలకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రులు మరియు ఎమ్మెల్యేలు పక్కా వ్యూహంతో ఏకగ్రీవాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.
ఏదో ఒక రకంగా అవతలి వ్యక్తి నుండి పోటీ లేకుండా చేయడం ద్వారా ఏకగ్రీవం చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడట. అందుకోసం వైకాపా నాయకులు కూడా అదే పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి నాయకుడు కూడా కనీసం ఏకగ్రీవాలు చేయాలనే టార్గెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకగ్రీవాలు ఎక్కువ అవ్వడం వల్ల మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ లు మొత్తం కూడా వైకాపా కే దక్కే అవకాశం ఉంది. స్థానికి సంస్థల్లో ఏ పార్టీ వారు అయితే ఉంటారో ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ వారికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అందుకే ఎక్కువగా ఏకగ్రీవాలు చేసేందుకు అన్ని మార్గాలను అనుసరిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కు పోటీ అన్నట్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరీ మరీ ఏకగ్రీవాలు చేసేందుకు సిద్దం అవుతున్నారట.