vaizag steel : ఇంకా ఎన్నాళ్లు ఈ మోసం సాయన్న.. ఢిల్లీలో మాట్లాడే ధైర్యం లేదు గల్లీలో స్పీచ్‌ దంచి కొడుతారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

vaizag steel : ఇంకా ఎన్నాళ్లు ఈ మోసం సాయన్న.. ఢిల్లీలో మాట్లాడే ధైర్యం లేదు గల్లీలో స్పీచ్‌ దంచి కొడుతారు

 Authored By himanshi | The Telugu News | Updated on :21 February 2021,11:50 am

vaizag steel : వైజాగ్‌ స్ట్రీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిన్న వైకాపా నెం.2 ఎంపీ విజయ సాయి రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. నగరంలోని ముఖ్య ప్రాంతాలన్ని కవర్‌ అయ్యేలా విజయ సాయి రెడ్డి పాద యాత్ర చేస్తూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నట్లుగా పేర్కొన్నాడు. ప్రైవేటీకరణ నిర్ణయంను వెనక్కు తీసుకోవాల్సిందే అంటూ పాదయాత్ర సందర్బంగా విజయ సాయి రెడ్డి కేంద్రంను డిమాండ్‌ చేశాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓ రేంజ్ లో విజయ సాయి రెడ్డి ఏకి పడేశాడు. ఆయన విమర్శలు ఏకంగా మోడీకి కూడా తాకాయి. గల్లీలో ఇంతగా నోరు చేసుకుంటున్న విజయ సాయి రెడ్డి ఎందుకు ఢిల్లీలో నోరు విప్పడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Trolls on vijayasai reddy save vaizag steel plant padayatra

Trolls on vijayasai reddy save vaizag steel plant padayatra

ఢిల్లీ వెళ్లినప్పుడు మోడీ మరియు అమిత్ షాలను పదే పదే కలవడంతో పాటు వారికి అనేక బిల్లుల విషయంలో రాజ్య సభలో సహకారం అందించిన విజయ సాయి రెడ్డి ఇప్పుడు మాత్రం వైజాగ్‌ స్టీల్‌ ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ గల్లీలో ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఢిల్లీలో వారిని నిలదీసే దమ్ము ధైర్యం లేని విజయ సాయి రెడ్డి ఇలా ప్రజలను మోసం చేసేందుకు అన్నట్లుగా పాద యాత్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. చిత్త శుద్ది ఉంటే వెంటనే రాజ్యసభ సభ్యత్వంకు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో పాటు తన పార్టీ ఎంపీలందరిని కూడా రాజీనామా చేయించి వైజాగ్‌ స్టీల్‌ కోసం పోరాడాలంటూ డిమాండ్‌ చేయడం జరిగింది.

విజయసాయి వైకాపా పరువు కాపాడటం కోసం విశాఖ పట్నంలో పాదయాత్రల డ్రామాలు మొదలు పెట్టాడని చిత్త శుద్ది లేని శివ పూజ అన్నట్లుగా విజయ సాయి రెడ్డి ఉద్యమం ఉంది అంటూ ఇతర పార్టీ నాయకులు కూడా అంటున్నారు. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ నాయకుల తీరు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తుంది. ఇప్పటి వరకు సీరియస్ గా ప్రధానిని కాని అమిత్‌ షా ను కాని కలిసి అడిగిందే లేదు. ఇప్పటికే వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ అయ్యిందని ఇప్పుడు ఏం చేసినా కూడా ప్రయోజనం లేదనే కామెంట్స్‌ వస్తున్నాయి. అందుకే పార్టీలు జనాల్లో ఉద్యమాలు చేస్తున్నట్లుగా కలరింగ్‌ ఇస్తున్నారు తప్ప ఢిల్లీ స్థాయిలో ఆందోళనలు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది