Vallabhaneni Vamsi : రోజురోజుకు మరింతగా క్షిణిస్తున్న వంశీ ఆరోగ్యం..!
ప్రధానాంశాలు:
Vallabhaneni Vamsi : రోజురోజుకు మరింతగా క్షిణిస్తున్న వంశీ ఆరోగ్యం..!
Vallabhaneni Vamsi : నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్న వంశీ ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించడంతో, ఆయనను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి (జీజీహెచ్) తరలించారు. కోర్టుకు హాజరైన సమయంలో కూడా ఆయన నీరసంగా కనిపించడం గమనార్హం. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వంశీని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Vallabhaneni Vamsi : రోజురోజుకు మరింతగా క్షిణిస్తున్న వంశీ ఆరోగ్యం..!
Vallabhaneni Vamsi వంశీ ఆరోగ్యం పై కుటుంబ సభ్యుల్లో ఆందోళన.. గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలింపు
వంశీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జైలు అధికారులు మొదట విజయవాడ ప్రభుత్వాస్పత్రికి, అనంతరం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వంశీని తిరిగి జైలుకు తరలించినా, ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో మరోసారి ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని వంశీ న్యాయమూర్తికి వివరించగా, తక్షణ వైద్యం అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
వంశీను గుంటూరు జీజీహెచ్‌లోకి తరలించిన అనంతరం ఆస్పత్రి గేటును పోలీసులు మూసివేయడం, ఆయన సతీమణిని పరామర్శించేందుకు అనుమతించకపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరుపై వంశీ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వంశీ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో పలువురు రాజకీయ నేతలు మరియు అభిమానులు వంశీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో వంశీని ఉంచే అవకాశం ఉంది.
వల్లభనేని వంశీ హెల్త్ బులెటిన్.. వంశీకి ఫిట్స్ ఉన్నాయి.. నిద్రపోయేటప్పుడు శ్వాస ఆగిపోతుంటుంది స్లీప్ టెస్ట్ చేసి చికిత్స చేయాల్సి ఉంటుంది అయితే.. మా దగ్గర స్లీప్ టెస్ట్ అందుబాటులో లేకపోవడంతో ఇతర ఆసుపత్రికి రిఫర్ చేశాం – గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్