Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీని జైలుకి తరలింపు.. 14రోజులు రిమాండ్..!
ప్రధానాంశాలు:
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీని జైలుకి తరలింపు.. 14రోజులు రిమాండ్..!
Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ YCP నేత Vallabhaneni Vamsi వల్లభనేని వంశీని Andhra pradesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు Police అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, రెండ్రోజుల క్రితం హఠాత్తుగా సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకున్నారు. అయితే వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరింపులు దిగారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. అందుకే అతను కేసు వెనక్కి తీసుకున్నారని పోలీసులకు చెప్పారు

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీని జైలుకి తరలింపు.. 14రోజులు రిమాండ్..!
Vallabhaneni Vamsi జైలుకి తరలింపు..
గురువారం మధ్యాహ్నం 1గంట సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వంశీని తరలించిన పోలీసులు.. దాదాపు ఎనిమిది గంటలపాటు అతన్ని ప్రశ్నించారు. విజయవాడ ఫోర్త్ ఏసీఎంఎం జడ్జి ఎదుట రాత్రి 10.30 గంటలకు హాజరుపర్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ అర్ధరాత్రి 2.30గంటలకు వంశీకి, అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ లకు 14రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు.
దీంతో వారిని శుక్రవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.వల్లభనేని వంశీ అరెస్టుపై అతని సతీమణి పంకజశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తానని అన్నారు. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. వంశీకి ఆరోగ్యం బాగాలేదు.. నేను టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుంచి కనీసం కాపీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్టు చేశారో..? ఏ కేసులో అరెస్టు చేశారో ఇప్పటికీ పోలీసులు చెప్పలేదు అని తన ఆవేదన వ్యక్తం చేసింది.