Andhra Pradesh : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో ఒక అంశం వెలుగులోకి వస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు కూటమిగా సాగుతూండడంతో ఏపీ వాలంటీర్ల ఇష్యూ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో వాలంటీర్లను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కేజ్ ఫిర్యాదు చేశాడని వైసీపీ వర్గాలు మండిపడుతుంటే….అలాంటిది ఏమీ లేదని ఎన్నికల్లో వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండడం అనేది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదని దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఏపీలో పెన్షన్లు ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్లీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జగన్ లేదా చంద్రబాబు అధికారంలోకి వస్తేనే పెన్షన్లు అనేవి వస్తాయి అనే వార్తలు ప్రస్తుతం చాలా బాగా వినిపిస్తున్నాయి. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అయితే ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ వాలంటీర్లను ఆపడం అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం అని చెప్పాలి. అయితే ఈ నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా వారు వైసీపీ ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు. అలాగే జగన్ పెట్టిన ప్రతి పథకాన్ని వీరు గడప గడపకి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో ఓటర్లను వాలంటీర్లు ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఈ విషయాలను తెలుపుతూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఈయన ఆంధ్రప్రదేశ్ కు ఫార్మర్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయడం జరిగింది. అయితే ఈయన చంద్రబాబుకు కూడా చాలా సన్నిహితంగా ఉండారనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాలంటీర్లను రద్దు చేస్తూ ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కేవలం వాలంటీర్లను ఆపడం జరిగింది తప్ప ఏపీలో పెన్షన్లు మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పెన్షన్ అనేది ఎక్కడ తీసుకోవాలి అనే ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ప్రభుత్వం వాలంటీర్లకు బదులుగా ఆల్టర్నేట్ గా ఎవరినైనా చూసుకోవాలి , లేదా పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులను పంపించాలి , లేకపోతే పెన్షన్ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో వేసేలా చేయాలంటూ చెప్పడం జరిగింది.
అయితే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్య సలహాదారి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఏం చెప్పారంటే…పెన్షన్ పొందే లబ్ధిదారులు అందరూ కూడా మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామా లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి మీ పెన్షన్ తీసుకోండి. అక్కడ మీకు పెన్షన్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఈనెల 3వ తారీఖున పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్లి తీసుకోగలరు అనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కావున ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పెన్షన్స్ అనేవి అసలు ఆగటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి గ్రామ లేదా వార్డు సచివాలయ కు వెళ్లి లబ్ధిదారులందరూ పెన్షన్ తీసుకోవచ్చు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.