Andhra Pradesh : వాలంటీర్లు లేకుండానే పెన్షన్ ఇచ్చే ప్రయత్నం…. ఈ పని జగన్ ప్రభుత్వం వెంటనే చేయాలి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Andhra Pradesh : వాలంటీర్లు లేకుండానే పెన్షన్ ఇచ్చే ప్రయత్నం…. ఈ పని జగన్ ప్రభుత్వం వెంటనే చేయాలి…!

Andhra Pradesh : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో ఒక అంశం వెలుగులోకి వస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు కూటమిగా సాగుతూండడంతో ఏపీ వాలంటీర్ల ఇష్యూ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో వాలంటీర్లను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కేజ్ ఫిర్యాదు చేశాడని వైసీపీ వర్గాలు మండిపడుతుంటే….అలాంటిది ఏమీ లేదని ఎన్నికల్లో వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండడం […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Andhra Pradesh : వాలంటీర్లు లేకుండానే పెన్షన్ ఇచ్చే ప్రయత్నం.... ఈ పని జగన్ ప్రభుత్వం వెంటనే చేయాలి...!

Andhra Pradesh : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో ఒక అంశం వెలుగులోకి వస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు కూటమిగా సాగుతూండడంతో ఏపీ వాలంటీర్ల ఇష్యూ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో వాలంటీర్లను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కేజ్ ఫిర్యాదు చేశాడని వైసీపీ వర్గాలు మండిపడుతుంటే….అలాంటిది ఏమీ లేదని ఎన్నికల్లో వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండడం అనేది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదని దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఏపీలో పెన్షన్లు ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్లీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జగన్ లేదా చంద్రబాబు అధికారంలోకి వస్తేనే పెన్షన్లు అనేవి వస్తాయి అనే వార్తలు ప్రస్తుతం చాలా బాగా వినిపిస్తున్నాయి. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అయితే ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ వాలంటీర్లను ఆపడం అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం అని చెప్పాలి. అయితే ఈ నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా వారు వైసీపీ ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు. అలాగే జగన్ పెట్టిన ప్రతి పథకాన్ని వీరు గడప గడపకి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో ఓటర్లను వాలంటీర్లు ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఈ విషయాలను తెలుపుతూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

ఈయన ఆంధ్రప్రదేశ్ కు ఫార్మర్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయడం జరిగింది. అయితే ఈయన చంద్రబాబుకు కూడా చాలా సన్నిహితంగా ఉండారనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాలంటీర్లను రద్దు చేస్తూ ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కేవలం వాలంటీర్లను ఆపడం జరిగింది తప్ప ఏపీలో పెన్షన్లు మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పెన్షన్ అనేది ఎక్కడ తీసుకోవాలి అనే ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ప్రభుత్వం వాలంటీర్లకు బదులుగా ఆల్టర్నేట్ గా ఎవరినైనా చూసుకోవాలి , లేదా పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులను పంపించాలి , లేకపోతే పెన్షన్ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో వేసేలా చేయాలంటూ చెప్పడం జరిగింది.

అయితే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్య సలహాదారి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఏం చెప్పారంటే…పెన్షన్ పొందే లబ్ధిదారులు అందరూ కూడా మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామా లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి మీ పెన్షన్ తీసుకోండి. అక్కడ మీకు పెన్షన్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఈనెల 3వ తారీఖున పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్లి తీసుకోగలరు అనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కావున ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పెన్షన్స్ అనేవి అసలు ఆగటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి గ్రామ లేదా వార్డు సచివాలయ కు వెళ్లి లబ్ధిదారులందరూ పెన్షన్ తీసుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది