
Rohit Sharma : సడెన్‌గా రోహిత్ దగ్గరకి ఉరికొచ్చిన అభిమాని.. ఒక్కసారిగా జడుసుకొని ఎగిరి గంతేసిన హిట్‌మ్యాన్..!
Rohit Sharma : ఐపీఎల్ సీజన్ 2024 చాలా రంజుగా సాగుతుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఒక్క హిట్ కూడా కొట్లలేదు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై జట్టు పెద్దగా రాణించడం లేదు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు మూడింట్లోను ఓటమి పాలైంది. అయితే తాజగా రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై తలపడగా, మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మపై ఎన్నో అంచనాలు పెట్టుకోగా, ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక హార్దిక్ పాండ్య (34), తిలక్ వర్మ (32) పరుగులు చేశారు. యుజువేంద్ర చాహల్, బౌల్డ్ తలో మూడు వికెట్లు తీయగా, బర్జర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
తక్కువ లక్ష్య చేధనకి బరిలోకి దిగిన రాజస్థాన్ 15.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న రియాన్ పరాగ్ (54) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ రాయల్స్ సులువుగా గెలిచింది. ముంబయికి ఇది హ్యాట్రిక్ ఓటమి కాగా, రాజస్థాన్‌కు హ్యాట్రిక్ విజయం. ముంబై బౌలర్ ఆకాశ్ మధ్వాల్ (20/3) చెలరేగినా, కూడా లక్ష్యం తక్కువది కావడంతో ముంబై ఖాతాలో మరో ఓటమి వచ్చి చేరింది. ఇక ఈ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యాకి నిరసన బాగానే తగిలింది. ఆయనని విమర్శిస్తూనే ఉన్న సమయంలో రోహిత్ కలగ జేసుకొని కాస్త నచ్చజెప్పారు. ఎంకరేజ్ చేయాలి తప్ప అలా విమర్శించకూడదు అంటూ రోహిత్ సైన్ చేశారు.
ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చిన ఓ అభిమాని రోహిత్ శర్మను భయపెట్టాడు. ఫస్ట్ స్లిప్‌లో రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో .. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో ఫీల్డ్ సెటప్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో సడెన్‌గా ఓ అభిమాని మైదానంలోకి వచ్చాడు. సడెన్ గా అభిమాని తన సమీపింగా రావడంతో రోహిత్ శర్మ గజ్జున వణికాడు. సదరు అభిమానికి దూరంగా జరిగి ఆ తర్వాత తాను అభిమానని గ్రహించి.. హగ్ ఇచ్చాడు. పక్కనే ఉన్న ఇషాన్ కిషన్‌కి కూడా ఆ అభిమాని హగ్ ఇచ్చి సంతోషంతో వెనుదిరిగాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా, ఈ వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.