Vangalapudi Anitha : వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం కాదు.. కర్మ సిద్ధాంతమేనన్న హోం మంత్రి..!
ప్రధానాంశాలు:
Vangalapudi Anitha : వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం కాదు.. కర్మ సిద్ధాంతమేనన్న హోం మంత్రి..!
Vangalapudi Anitha : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ vallabhaneni vamsi అరెస్టు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వంశి అరెస్ట్ విషయంలో ఎవరికి వారు పలు రకాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అరెస్ట్ సక్రమమేనని ఆమె పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ లో తనకు కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

Vangalapudi Anitha : వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం కాదు.. కర్మ సిద్ధాంతమేనన్న హోం మంత్రి..!
Vangalapudi Anitha : సక్రమ అరెస్ట్..
ఈ 8 నెలల్లో వైఎస్సార్సీపీ నేతలు ఎన్నిసార్లు డీజీపీని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారని అనిత ప్రశ్నించారు. వంశీ అరెస్టు అక్రమం కాదని సక్రమమేనని దానికి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు చెప్పామని హోం మంత్రి తెలిపారు.
గన్నవరం పార్టీ కార్యాలయం దాడి ఘటనలో 71వ నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ తానంతట తానే వచ్చి కిడ్నాప్ కేసులో ఏ1గా ఇరుక్కున్నాడని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. వంశీ చరిత్ర మొత్తం అరాచకమయమని మండిపడ్డారు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ పెద్ద సైకోని సంతృప్తి పరిచేందుకు ఇష్టానుసారంగా విధ్వంసం సృష్టించాడని ఆగ్రహం వ్యక్తం చేసారు.వైఎస్సార్సీపీ హయంలో అధికారం అండతో రెచ్చిపోయిన వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది