Vangaveeti Radha : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించే దమ్ముందా… వంగవీటి రాధా…!
ప్రధానాంశాలు:
Vangaveeti Radha : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించే దమ్ముందా... వంగవీటి రాధా...!
Vangaveeti Radha : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు జోరుగా ప్రచారాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పగలు రాత్రి తేడా లేకుండా ప్రజాగలం భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ నియోజకవర్గంలో ప్రజాగలం భారీ బహిరంగ సభలను నిర్వహించారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడుతో పాటు వంగవీటి రాధ కూడా విచ్చేసి ప్రచారాలలో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే వంగవీటి రాధా మాట్లాడుతూ వైయస్ జగన్ పై అలాగే వైసీపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vangaveeti Radha : సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న జగన్…
ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదే పదే పలు సందర్భాలలో బట్టన్ నొక్కామని చెబుతున్నారు. అలాగే ప్రజల వద్ద నుండి ఎంత నొక్కేసావు కూడా కాస్త చెప్పు జగన్ అంటూ ప్రజలందరూ కోరుకుంటున్నారని వంగవీటి రాధ తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం చేయడం లేదని సంక్షేమం పేరుతో పేద ప్రజల కడుపు కొడుతూ దోచుకుంటున్నాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే సింహం బయలుదేరిందని చెప్తున్నారు. సింహాలు పులులు ఉండాల్సింది అడవుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడు అని ఈ సందర్భంగా వంగవీటి రాధా వ్యాఖ్యానించారు.ప్రజలు సమర్థవంతమైన నాయకుడు కావాలని కోరుకుంటున్నారని అలాంటి రాజకీయ అనుభవం నాయకత్వం కలిగిన ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు అని రాధా తెలిపారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు దిక్షూచి కింద భవిష్యత్తులో నిలబడతారని తెలిపారు.

Vangaveeti Radha : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించే దమ్ముందా… వంగవీటి రాధా…!
ఇక ఈరోజు జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ తక్కువ సీట్లు తీసుకున్నారని అంటున్నారు. అలాంటి వారందరికీ ఒకటే సవాల్. పులివెందులనా, పిఠాపురం మా చూసుకుందామంటూ రాదా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన మరియు టీడీపీ ప్రజలంతా కలిసి పోరాడితే విజయం మన సొంతమవుతుందని తెలిపారు. ఇక ఈ రెండు వారాలు పాటు మనం కలిసికట్టుగా పోరాడుదాం అని మన భవిష్యత్తును చంద్రబాబు చేతిలో పెడదామంటూ రాధా వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారు కచ్చితంగా మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారని తెలిపారు. కులాభిమానం ,మతాభిమానం ప్రాంతీయ అభిమానం పక్కనపెట్టి అందరం కలిసికట్టుగా చంద్రబాబుకు అండగా నిలబడి గెలిపిద్దామని కోరారు.