Pithapuram Varma : చంద్రబాబుకు వర్మ షరతులు.. పిఠాపురంలో ఏంజరగబోతుంది..?
Pithapuram Varma : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం హాట్ టాపిక్‌గా మారుతోంది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా ఉన్న ఈ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ నేత వర్మ చేసిన వ్యాఖ్యలు, షరతులు కలకలం రేపుతున్నాయి. పవన్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు ఇప్పటి వరకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడం, అదే సమయంలో జనసేన నాయకుడు నాగబాబు వర్మపై చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. వర్మ మద్దతుదారులు బయటపడటంతో ఈ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కూటమి పార్టీల నాయకత్వం ఈ విషయంపై స్పందించకపోయినా, వర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం కీలకంగా మారాయి.
Pithapuram Varma : చంద్రబాబుకు వర్మ షరతులు.. పిఠాపురంలో ఏంజరగబోతుంది..?
వర్మ రాజకీయ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీకి అనుసరణగా ఉండే వర్మకు మొదటి దశలోనే ఎమ్మెల్సీ పదవి హామీగా ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు అమలులోకి రాలేదు. ఇప్పుడు మాత్రం పార్టీ లోపలే వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల మరో పవర్ సెంటర్ అవుతుందనే భావన హస్తినలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో, వర్మకు నామినేటెడ్ పదవిని ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నుంచి పోటీ చేస్తుండటంతో వర్మకు అక్కడినుంచి అవకాశాలు లేవన్నది స్పష్టమవుతోంది. వర్మ కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని తన భవిష్యత్తు కోసం వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇటీవల వర్మ చేసిన వ్యాఖ్యలు మరో ఆసక్తికర దిశగా దారి తీస్తున్నాయి. టీడీపీకి 2047 ప్రణాళిక అవసరమని, లోకేష్ నాయకత్వం అవసరమని ఆయన పేర్కొనడం రాజకీయ పరిశీలకుల్లో చర్చనీయాంశంగా మారింది. యువగళం పాదయాత్రే కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిందని వ్యాఖ్యానించిన వర్మ, ద్వారా జనసేన ప్రచార ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేసినట్టు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక వర్మ తన భవిష్యత్‌కు బలమైన స్థానం కల్పించుకునే వ్యూహంతో ఉన్నారని అర్థమవుతోంది. కూటమి కొనసాగినంతకాలం పిఠాపురం ఆయనకు అందని కలే అయినా, ఇతర మార్గాల ద్వారా రాజకీయం లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా వర్మ ముందడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటె చంద్రబాబు త్వరలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ తరుణంలో వర్మ కు కొత్తగా ఓ నియోజకవర్గాన్ని ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ వర్మ కు తెలియజేసారని టాక్. మరి వర్మ కొత్త నియోజకవర్గానికి వెళ్తాడా ..? లేక పిఠాపురమే కావాలని ఫిక్స్ అవుతాడా అనేది చూడాలి.
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
This website uses cookies.