RBI Good News : మధ్యతరగతి ప్రజలకు RBI గుడ్ న్యూస్..!
RBI Good News : యుపిఐ (UPI) ద్వారా రోజూ పేమెంట్స్ చేసే వారికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. డిజిటల్ పేమెంట్స్ మరింత సులభంగా, ప్రయోజనకరంగా మారాలన్న లక్ష్యంతో తాజాగా RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పర్సన్ టు మర్చంట్ (P2M) మరియు మర్చంట్ టు మర్చంట్ (M2M) యుపిఐ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన లిమిటును పెంచే అధికారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి అప్పగించింది. ఇప్పటివరకు ఈ లిమిట్ రూ.1 లక్షగా ఉండగా, ఇప్పుడు అవసరాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. ఈ మార్పుతో వ్యాపారులకు, పెద్ద మొత్తాల లావాదేవీలు చేసే వారికి ఎంతో ఉపయోగపడనుంది.
RBI Good News : మధ్యతరగతి ప్రజలకు RBI గుడ్ న్యూస్..!
ఈ నిర్ణయం ప్రధానంగా వ్యాపార వర్గాలకు ప్రయోజనకరంగా ఉండబోతోంది. రోజూ పెద్ద మొత్తాల ఆన్‌లైన్ లావాదేవీలు చేసే వ్యాపారులు ఇకపై అడ్డంకులేని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ముఖ్యంగా జ్యువెలరీ షాపులు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లు, ఈ-కామర్స్ బిజినెస్‌లకు ఇది కలిసొచ్చే నిర్ణయం. అయితే పర్సన్ టు పర్సన్ (P2P) ట్రాన్సాక్షన్స్‌లో ఎలాంటి మార్పు లేదు. అంటే మీరు ఇతర వ్యక్తికి యుపిఐ ద్వారా పంపగలిగే గరిష్ఠ మొత్తం ఇప్పటికీ రూ.1 లక్షగానే ఉంటుంది.
ఈ నిర్ణయం భారతదేశంలో డిజిటల్ ఫైనాన్స్ వ్యవస్థను మరింత ముందుకు నడిపించనుంది. నగదు బదులుగా డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరుగుతుండటంతో పారదర్శకత పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్సాహం లభిస్తుంది. దీనితోపాటు బ్యాంకులు కూడా ట్రాన్సాక్షన్ లిమిట్స్ పెరగడం వల్ల తమ టెక్నికల్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇకపై NPCI మార్కెట్ అవసరాలను అంచనా వేస్తూ బ్యాంకులతో చర్చించి యుపిఐ ట్రాన్సాక్షన్ పరిమితులను అనుసంధానించే కీలక బాధ్యతను వహించనుంది.
Whatsapp : మెటా ఇప్పుడు వాట్సాప్‌లో కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సందేశ పరిమితి సెట్ చేయబడుతుంది. ఈ…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్రంలో భూ భారతి చట్టం అమలుకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. ఈ చట్టం…
IPL SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పలు జట్లు రేసు నుండి తప్పుకోగా, సన్ రైజర్స్ హైదరాబాద్…
Ginger Buttermilk : మజ్జిగ.. దాహాన్ని తీర్చడమే కాకుండా శరీర వేడిని తగ్గించి బాడీని చల్లబరుస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమయ్యే…
Kesineni Chinni : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్, కేశినేని నాని మరియు కేశినేని చిన్ని మధ్య కొనసాగుతున్న వివాదం…
Red Apple vs Green Apple : 'రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడిని దూరంగా ఉంచుతుంది' అనే ప్రసిద్ధ…
Today Gold Price : దేశీయ మార్కెట్లలో ఈరోజు మే 5, 2025 న బంగారం ధర Gold rate…
Banana Stems : అందరూ ఆస్వాదించే రుచికరమైన పండు అరటిపండు. ఆరోగ్య ప్రయోజనాలను సమృద్ధిగా అందిస్తాయి. ఆసక్తికరంగా, అరటి చెట్టులోని…
This website uses cookies.