Venu Swamy : మేలో మారిన జ‌గన్ జాత‌కం.. ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్పిన వేణు స్వామి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : మేలో మారిన జ‌గన్ జాత‌కం.. ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్పిన వేణు స్వామి

 Authored By ramu | The Telugu News | Updated on :15 May 2024,11:00 am

Venu Swamy : టాలీవుడ్‌లో ల‌వ‌బుల్ పెయిర్‌గా ఉన్న‌ సమంత-నాగ చైతన్య విడాకుల ఇష్యూతో వార్త‌ల‌లోకి ఎక్కాడు వేణు స్వామి. విడాకుల‌కి ముందే వారిరివురు విడిపోతార‌ని వేణు స్వామి చెప్ప‌డంతో ఆయ‌న పేరు మారుమ్రోగిపోయింది. అప్ప‌టి నుండి సెలబ్రిటీలకు, రాజకీయ ప్రముఖులకు జ్యోతిష్యం చెప్తూ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్‌గా మారారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం అని జనసైనికులు చెప్పుకుంటున్న తరుణంలో ఆటం బాంబ్ పేల్చారు వేణు స్వామి. పవన్ కళ్యాణ్‌కి రాజకీయ యోగమే లేదని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని, కానీ ఆయన రాజకీయాలకు పనికిరారు అని అనేశారు వేణు స్వామి.

Venu Swamy మారిన వేణు స్వామి స్వ‌రం

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ఆయన బాగుపడాలనే కోరుకుంటా. కానీ ఆయనకు కుటిల రాజకీయాలు తెలియవు. కాబట్టి ఆయన సక్సెస్ కాలేరు అని అన్నారు వేణు స్వామి. పవన్ కళ్యాణ్‌కి సినిమాలకే అంకితం అవుతారని, రాజకీయాల పరంగా ఆయనపై 100 శాతం అంచనాలు పెట్టుకుంటే రిజల్ట్ మాత్రం 20 శాతమే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏపీలో మరోసారి జగనే అధికారంలోకి వస్తారని వేణు స్వామి పలు ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. రోజా, అంబటి రాంబాబు, అమర్నాథ్ వంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని వేణు స్వామి తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని మరోసారి కుండబద్దలు కొట్టేశారు.

Venu Swamy మేలో మారిన జ‌గన్ జాత‌కం ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్పిన వేణు స్వామి

Venu Swamy : మేలో మారిన జ‌గన్ జాత‌కం.. ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్పిన వేణు స్వామి

అయితే జగన్ గెలిచిన తరువాత ఆయన కొన్ని న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అది ఈడీనా లేక సీబీఐనా అనేది తాను చెప్పనని.. జగన్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత కొన్ని సమస్యలను ఫేస్ చేస్తారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. వేణు స్వామి చేసిన కామెంట్స్ తో వైసీపీ శ్రేణుల‌తో పాటు జ‌న‌సేన కార్త‌క‌ర్త‌లు కూడా ఆందోళన చెందుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది