Venu Swamy : తప్పు ఒప్పుకున్న వేణు స్వామి.. ఇకపై ఎవరి జాతకాలు చెప్పనన్న ప్రముఖ జ్యోతిష్కుడు
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి సినీ ,రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ నిత్యం వార్తలలో నిలుస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నా.సమంత- నాగ చైతన్య విడాకుల విషయంలో ఆయన చెప్పిన జాతకం నిజం కావడంతో ఆయనపై అందరి ఫోకస్ పెరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ మళ్లీ గెలుస్తాడని, కేటీఆర్ ముఖ్య మంత్రి అవుతాడని చెప్పుకురాగా, అది బెడిసికొట్టింది.ఇక ఏపీ సీఎం కూడా జగన్ అవుతాడని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత వేణు స్వామి మాట్లాడుతూ.. ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని..తాను గడిచిన నాలుగేళ్లుగా జగనే సీఎం అని చెబుతున్నానని ఆయన తెలిపారు.
నేను రోజుకో మాట మాట్లాడానికి రాజకీయ విశ్లేషకుడును కాదని.. జ్యోతిషుడనని ఒక్కసారి చెప్పిన మాట మీదే తాను నిలబడతానని ఆయన వేణు స్వామి తెలిపారు. నేను ఇప్పటికే వందసార్లు చెప్పాను. మళ్లీ ఏపీలో 2024లో సీఎం అయ్యేది జగన్ అని ఆయన మరోసారి పునరుద్ఘటించారు.జగన్‌ది ఆరుద్ర నక్షత్రం 2023 నుంచి అష్టమన శని మొదలైంది. రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. అయినా అది మంచి స్థానంలో ఉంది. దీన్ని బట్టి సీఎం అయ్యేది ఆయనే అని అర్థం చేసుకోవచ్చు. అలాగే చంద్రబాబుది పుష్యమి నక్షత్రం పవన్ కల్యాణ్‌ది ఉత్తరాషాడ నక్షత్రం 2017 నుంచి 2025 వరకు శని ఉంది. జూలై వరకు దాని ప్రభావం ఉంటుందని వేణు స్వామి తెలిపారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైందని వేణు స్వామి వ్యాఖ్యనించారు.
Venu Swamy : తప్పు ఒప్పుకున్న వేణు స్వామి.. ఇకపై ఎవరి జాతకాలు చెప్పనన్న ప్రముఖ జ్యోతిష్కుడు
అయితే ఇప్పుడు కూటమి ప్రభంజనం వీస్తున్న సమయంలో వేణు స్వామి వీడియో విడుదల చేశారు. నేను మోదీ గారి హవా తగ్గుతుందని చెప్పా అది నిజమైంది. ఇక ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అవుతాడని అన్నాను. కాని అలా జరగలేదు. అయితే జగన్ విషయంలో నేను చెప్పిన జాతకం తేడా కొట్టడంతో ఇక ఎప్పుడు కూడా సీనీ, రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకి సంబంధించి జ్యోతిష్యం చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. ఇక నన్ను ట్రోల్ చేసే వాళ్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. వారిని ఆపలేను. కాకపోతే ఇన్నాళ్లు నన్ను నమ్మి నాతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని వేణు స్వామి
స్పష్టం చేశారు.
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
This website uses cookies.