Vidadala Rajini : మహిళ అని చూడకుండా సీఐ మీదకి వచ్చాడంటూ విడదల రజనీ కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Vidadala Rajini : మహిళ అని చూడకుండా సీఐ మీదకి వచ్చాడంటూ విడదల రజనీ కామెంట్స్..!
Vidadala Rajini : ప్రస్తుతం ఏపీలో వైసీపీ, కూటమి నాయకులకి అస్సలు పడడం లేదు. మరోవైపు పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కారు వద్ద తోసుకునే వరకూ వ్యవహారం వెళ్లింది.సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారని మాజీ మంత్రి విడదల రజినీ ఆగ్రహించారు.ఆమెకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Vidadala Rajini : మహిళ అని చూడకుండా సీఐ మీదకి వచ్చాడంటూ విడదల రజనీ కామెంట్స్..!
రజనీ ప్రయాణిస్తున్న కారును నిలిపి, అందులోనే ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రజనితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో విడదల రజినికి పోలీసులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగాయి.శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ విడదల రజిని పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు బలవంతంగా కారులోని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మాజీ మంత్రి అడ్డుకున్నారు.
దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు సహకరించాలని పోలీసులు చెప్తున్నప్పటికీ.. విడదల రజిని అడ్డుగా రావటంతో, పోలీసులు కాస్త దూకుడుగా వ్యవహరించారు.మహిళ అని కూడా చూడకుండా సీఐ మీద మీదకి వచ్చారు అంటూ విడదల రజిని ఆరోపించారు. సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు.నాపై కేసులు పెడతానని బెదిరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ విడదల రజనీ ఆవేదన వ్యక్తం చేసింది.
మహిళ అని కూడా చూడకుండా సీఐ మీద మీదకి వచ్చారు: విడదల రజిని
సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు
నాపై కేసులు పెడతానని బెదిరించారు
వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు
– విడదల రజిని https://t.co/eeGmOcRPhU pic.twitter.com/lnKjNqntGA
— BIG TV Breaking News (@bigtvtelugu) May 11, 2025