Vijayasai Reddy : జగన్ గారికి వ్యతిరేకంగా మాట్ల‌డ‌లేదు.. చెత్త ప‌త్రిక‌ల్లో రాస్తున్న వార్త‌లు న‌మ్మోద్దు.. విజ‌య‌సాయి రెడ్డి క్లారిటీ

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: May 31, 2025, 11:02 am
  •  Vijayasai Reddy : జగన్ గారికి వ్యతిరేకంగా మాట్ల‌డ‌లేదు.. చెత్త ప‌త్రిక‌ల్లో రాస్తున్న వార్త‌లు న‌మ్మోద్దు.. విజ‌య‌సాయి రెడ్డి క్లారిటీ

Vijayasai Reddy : విజ‌య‌సాయి రెడ్డి వైసీపీ నుండి బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న‌ని కొంద‌రు దారుణంగా తిట్టిపోస్తున్నారు. దానిపై ఇటీవ‌ల స్పందించిన విజ‌య‌సాయి రెడ్డి నన్ను కెలకటం, ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ.. జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు అని అన్నారు.

Vijayasai Reddy : జగన్ గారికి వ్యతిరేకంగా మాట్ల‌డ‌లేదు.. చెత్త ప‌త్రిక‌ల్లో రాస్తున్న వార్త‌లు న‌మ్మోద్దు.. విజ‌య‌సాయి రెడ్డి క్లారిటీ

Vijayasai Reddy : జగన్ గారికి వ్యతిరేకంగా మాట్ల‌డ‌లేదు.. చెత్త ప‌త్రిక‌ల్లో రాస్తున్న వార్త‌లు న‌మ్మోద్దు.. విజ‌య‌సాయి రెడ్డి క్లారిటీ

Vijayasai Reddy : ఇది క్లారిటీ

ఇక తాజాగా విజ‌యసాయి రెడ్డి త‌న ఎక్స్‌లో జగన్ గారికి వ్యతిరేకంగా నేను తిరుపతిలో, వైజాగ్ లో మాట్టాడినట్లు కొన్ని ఊరూ పేరూ లేని పత్రికలు, టీవీ చానళ్ళు చేస్తున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది. జగన్ గారికి వ్యతిరేకంగా ఆఫ్ రికార్డ్ గానీ, ఆన్ రికార్డు గానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. కోటరీ వల్ల, విభేదించి పార్టీ వదిలానే కానీ, జగన్ గారికి హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు.

నేను రాజకీయాల్లో లేను. ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో నాకు శతృత్వం లేదు. నేను ఏ విషయం మాట్లాడదలచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా. లేదా నా అధికారిక ‘ఎక్స్’ ద్వారా తెలియజేస్తా. తెరవెనుక బాగోతాలు, నటనలు, ప్రస్తావనలు ఉండవు. నా పేరిట అవాస్తవాలు ప్రచారం చేయటానికి ఉబలాటపడుతున్న వారు నల్ల కోట్లు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, చెత్త పత్రికల్లో రాస్తున్న రాతలను నమ్మవద్దని కోరుతున్నాను అని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు..

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp