Vijayasai Reddy : ఆంధ్ర ప్రజలు పామునైన నమ్ముతారు కానీ కాంగ్రెస్ ను మాత్రం నమ్మరు.. విజయసాయిరెడ్డి..!
ప్రధానాంశాలు:
Vijayasai Reddy : ఆంధ్ర ప్రజలు పామునైన నమ్ముతారు కానీ కాంగ్రెస్ ను మాత్రం నమ్మరు.. విజయసాయిరెడ్డి..!
Vijayasai Reddy : మొన్నటి వరకు జరిగిన తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన వైఎస్ షర్మిల ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రయాణాలను మొదలుపెట్టారు. ఏపీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా కొత్త బాధ్యతలను షర్మిల స్వీకరించబోతున్నారు. విజయవాడలోని కానూరులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో షర్మిల ఎపిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలను చేపట్టనున్నారు.అయితే ఈ కార్యక్రమానికి ముందు ఆమె తన సొంత జిల్లాకు వెళ్తారు. ఇడుపులపాయను సందర్శించి తన తండ్రి గారైన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అయితే షర్మిల వెంట మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రారావు మాజీ మంత్రులు ఎన్ రఘువీరారెడ్డి , సాకే శైలజానధ్ , రాజంపేట లోక్ సభ ఇన్చార్జి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి , మాజీ ఎమ్మెల్యే అహ్మదుల్లా మరియు తదితర నాయకులు కూడా ఉన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిల స్వీకరించబోతున్న వేళ..కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి వి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఘాటు విమర్శలు చేయసాగారు. అదేవిధంగా పలు రకాల ఆరోపణలను కూడా గుప్పించారు. గత కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కాంగ్రెస్ పార్టీని పాముతో పోల్చారు. అయితే 2004 మరియు 2009లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడడం పై ఉమ్మడి ఏపీ అత్యంత కీలకంగా వ్యవహరించిందని సాయి రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ సాధించిన లోక్ సభ స్థానాల గురించి ఆయన వివరించారు.ఇక ప్రస్తుత కాలంలో కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు గుర్తించకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్నారని , ఇక ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే సమయం ఆసన్నమైందంటూ ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఏపీ ప్రజలు డిమాండ్స్ ను మరియు అవసరాలను కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదంటూ ఆయన విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచి గుణపాఠం నేర్చుకున్నారని అన్ని విధాలుగా మోసగించిన ఆ పార్టీ ని ఇక్కడి ప్రజలు ఇకపై విశ్వసించబోరని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావాలంటే పామునైన నమ్ముతారేమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఎప్పటికీ నమ్మరని స్పష్టం చేశారు.