Vijayasai Reddy : ఇటీవల ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ, ఏపీ ఎన్నికలు రంజుగా సాగగా హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూసారు. ఈ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండగా.. అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో.. పొలిటికల్ హీట్ పెరిగింది. అలాగే జమ్మూకాశ్మీర్‌లో 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేశాక, పదేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. అందువల్ల ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా సాగింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్‌లో సునామీ సృష్టించిన ఆ పార్టీ..ఈవీఎంలను తెరిచిన తరువాత కుప్పకూలింది. ఈవీఎం కౌంటింగ్ ఆరంభమైన తరువాత భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లింది. భారీ మెజారిటీని సాధించింది.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి గంటలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 71 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు. ఆ తరువాత ఫలితాలు తారుమారు అయ్యాయి. మొదట్లో కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. చివరికి- 48 సీట్లతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది హర్యానాలో. 71 స్థానాల్లో ఆధిక్యతలో కనిపించిన కాంగ్రెస్ 37 నియోజకవర్గాలకే పరిమితమైంది. దీంతో ఈవీఎం పని తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీ విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి “ప్రపంచ బ్యాంకు జీతగాడు…చంద్రబాబు మోసగాడు”……అన్న కమ్యూనిస్టుపార్టీల పాత పాట గుర్తుకొస్తుందని సెటైర్లు పేల్చారు సాయిరెడ్డి. ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత “ఫార్మ్ 20” వెబ్ సైట్ లో పెట్టిందని…. పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చు అంటూ చురకలు అంటించారు.
ఎన్నికలు ఫలితాలు వెలువతున్నప్పుడు ఆ తర్వాత మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకి వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ గూండాలు అరాచకం చేసారన్నారు. ఫారం 20 వివరాలు బయటకి రాగానే లడ్డు వ్యవహారం వాళ్ళ కుట్రలో భాగంగా పక్కా స్కెచ్ తో మొదలెట్టారు. చంద్రబాబుకు నిజానిజాలతో పనిలేదు. ఇది నెయ్యికోసమో భగవంతుడి కోసమో మొదలెట్టింది కాదు. ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి మొదలెట్టిన అరాచకం అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్ ని ముందుగా గుజరాత్ నుండి తెప్పించి పెట్టుకుని టీటీడీకి పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడని ఆరోపణలు చేశారు విజయ సాయి.
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.