జగనన్న మోసం చేశాడంటూ బాధతో పార్టీకి రాజీనామా చేశాడు
vishaka patnam city president vamshi krishna : ఏ పార్టీలో అయినా పదవులు పంపిణీ చేసే క్రమంలో గొడవలు చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. ఒక్కో పదవికి పదుల సంఖ్యలో ఆశావాహులు ఉంటారు. అందులో కొందరు మరీ ఎక్కువ ఆశ పెట్టుకుని ఉండి ఆ పదవి రాకపోవడంతో మైండ్ బ్లాంక్ అయ్యి సొంత పార్టీ అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వైజాగ్ వైకాపాలో అదే కనిపిస్తుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ మేయర్ పీఠంను తనకు ఇస్తానంటూ గతంలో హామీ ఇవ్వడంతో కార్పోరేటర్ గా పోటీ చేసి గెలిచాను అని, పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డాను అంటూ వైజాగ్ పార్టీ అధ్యక్షుడు వంశీ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే సీటు ఇస్తానంటూ గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారు. ఈసారి మేయర్ పీఠంను కూడా ఇవ్వకుండా మోసం చేశారంటూ వంశీ కృష్ణ ఆరోపిస్తున్నాడు.
vamshi krishna : మేయర్ పదవిని ఆశించి కార్పోరేటర్….
తనకు మేయర్ పదవి దక్కకుండా కొందరు కుట్ర చేశారని, తన గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్ద తప్పుడు విషయాలు చెప్పారంటూ వంశీ కృష్ణ ఆరోపిస్తున్నాడు. తాను మేయర్ కావాలనే ఉద్దేశ్యంతో కార్పోరేటర్ గా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న తాను మేయర్ పదవిని ఆశించి కార్పోరేటర్ గా పోటీ చేశాను కనుక ఇప్పుడు మేయర్ పీఠం దక్కని కారణంగా ఆ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే అంతకు ముందు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసే విషయమై ఆయన ప్రయత్నిస్తున్నాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇప్పటికే ప్రయత్నించిన వంశీ కృష్ణకు ఛాన్స్ దక్కక పోవడంతో వైజాగ్ పట్టణ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించాడు.

Ysrcp
ఇది కూడా చదవండి ==> ap 3 capitals : మూడు రాజధానుల విషయంలో కీలక అప్‌డేట్, జగన్ కల నెరవేరబోతుందా?
Ys Jagan : జగన్ అంటే తనకు అభిమానం..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు అభిమానం ఉందని కాని ఆయన కొందరి మాటలు విని నన్ను పక్కన పెట్టాడు అంటూ వంశీ కృష్ణ అంటున్నాడు. పదవికి రాజీనామా చేసినా కూడా తాను పార్టీ కోసం పని చేస్తానంటూ చెప్పాడు. పార్టీ కార్యకర్త మాదిరిగా పని చేసి ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తానంటూ హామీ ఇచ్చాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఈయన ఆరోపణలు విమర్శలు చేయకుండా లైట్ గానే ఉంటున్నాడు. ఈ వివాదం ముదిరితే ఆయన పార్టీ మారే విషయమై ఆలోచిస్తున్నాడు అంటున్నారు.