YS Jagan : జగన్ దేశం వదిలిపెట్టి వెళ్లిన లాక్కొని వస్తాం.. నిమ్మల రామానాయుడు
YS Jagan : ఏపీ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ – టిడిపి నేత, మంత్రి నిమ్మల రామానాయుడు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్.. “మీరు ఏ బుక్కులో పేరు రాసుకుంటారో రాసుకోండి, కానీ ప్రజలకు అన్యాయం చేసిన వారిని వదలనంటూ… వాళ్లకు సినిమా చూపిస్తా” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆయన వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపగా, అధికార పక్షం మాత్రం దీనిపై ఘాటు స్పందిస్తుంది. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి నిమ్మల రామానాయుడు కూడా జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

YS Jagan : జగన్ దేశం వదిలిపెట్టి వెళ్లిన లాక్కొని వస్తాం.. నిమ్మల రామానాయుడు
ఆయన మాట్లాడుతూ..”జగన్ రాజకీయాల ముసుగులో ఉన్న నేరస్తుడు. దేశం విడిచిపెట్టి వెళ్లిన లాక్కొని వస్తాం. ఆయన చేసిన అక్రమాలను ఏ ఒక్కరూ మర్చిపోలేరు” అని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి ఎదురైన ఆర్థిక సంక్షోభం, అభివృద్ధి పై అనేక ఆరోపణలు చేస్తూ రామానాయుడు విమర్శల వర్షం కురిపించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్, మంత్రి నిమ్మల రామానాయుడు మధ్య డైలాగ్ వార్
మీరు ఏ బుక్కులో పేరు రాసుకుంటారో రాసుకోండి.. అన్యాయం చేసినవాళ్లకు సినిమా చూపిస్తానన్న జగన్
దేశం విడిచిపెట్టి పోయినా లాక్కొని వస్తానంటూ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల ముసుగులో ఉన్న నేరస్తుడు జగన్ అని వ్యాఖ్యానించిన… pic.twitter.com/NpBSHQsjkF
— BIG TV Breaking News (@bigtvtelugu) May 21, 2025