Heavy Rains In AP : ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. భయపడిపోతున్న ఆంధ్రాప్రజలు..!
Heavy Rains In AP : వారం క్రితం భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వాతావరణ శాఖ హెచ్చరిక విజయవాడ వాసులకు నిద్ర పట్టనివ్వడం లేదు. వాతావరణ శాఖ ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తూర్పూగోదావరి, ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి, […]
ప్రధానాంశాలు:
Heavy Rains In AP : ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. భయపడిపోతున్న ఆంధ్రాప్రజలు..!
Heavy Rains In AP : వారం క్రితం భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వాతావరణ శాఖ హెచ్చరిక విజయవాడ వాసులకు నిద్ర పట్టనివ్వడం లేదు. వాతావరణ శాఖ ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తూర్పూగోదావరి, ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి, ఏలూరు అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతంలో నేడు (ఆదివారం) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. అయితే ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Heavy Rains In AP భారీ వర్షాలు..
ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంగా వీస్తాయని సూచించింది. ఇక ఉత్తర కోస్తా ఏపీ, యానాం ప్రాంతంలో రేపు (సోమవారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని అప్రమత్తం చేసింది. వాతావరణ శాఖహెచ్చరికలతో విజయవాడ వాసులు బిక్కు బిక్కు మంటు ఉన్నారు. ఇప్పటికే చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యం లో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆదివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక ఎల్లుండి కూడా దాదాపు ఇదే వాతావరణం ఉంటుందని తెలిపింది.