Vijayasai Reddy : విజయసాయిరెడ్డి వైసీపీ పై విమర్శలు చేయడం వెనుక కారణాలు ఏంటి..?
ప్రధానాంశాలు:
Vijayasai Reddy : విజయసాయిరెడ్డి వైసీపీ పై విమర్శలు చేయడం వెనుక కారణాలు ఏంటి..?
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. వైసీపీకి గుడ్‌బై చెప్పి పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన ఆయన తిరిగి అదే పార్టీపైనే విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. జగన్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు చేయకున్నా, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్లనే పార్టీని వీడినట్లు చెప్పడం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇన్నాళ్లు జగన్‌తో సన్నిహితంగా ఉండి, కీలక వ్యవహారాల్లో భాగస్వామిగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు కోటరీపై ఆరోపణలు చేయడం శోచనీయమని పార్టీ నాయకులు అంటున్నారు.

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి వైసీపీ పై విమర్శలు చేయడం వెనుక కారణాలు ఏంటి..?
Vijayasai Reddy వైసీపీని వీడిన తర్వాత విజయసాయిరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్… విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. పార్టీ కోసం 15 ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలే జగన్ కోటరీ అని, తాను నిన్నటివరకు ఆ కోటరీలోనే ఉండి ఇప్పుడు విమర్శలు చేయడం విపరీతమని అన్నారు. చంద్రబాబునాయుడి టీడీపీలో కోటరీ లేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించాలన్నారు. రాజకీయాల్లో కోటరీలు ఉండటం సహజమేనని, కానీ దాని గురించి విమర్శలు చేయడం భావ్యం కాదని అన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడిన తర్వాత మరింత బాధ్యతగా మాట్లాడతారని అనుకున్నామని, కానీ ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని గుడివాడ అన్నారు.
విజయసాయిరెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రస్థానం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తొలుత ఆయన రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పినట్లు చెప్పినా తాజా విమర్శలు చూస్తే మరో రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ రెండోసారి సీఎం అయితే విజయసాయిరెడ్డి ఇలాగే మాట్లాడేవారా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.