Pithapuram : ఎక్క‌డ‌ కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే.. పత్తాలేని జనసేనాని..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pithapuram : ఎక్క‌డ‌ కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే.. పత్తాలేని జనసేనాని..!

Pithapuram  : పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ పక్కా గెలుస్తున్నాడు.. కానీ మెజార్టీ ఎంత అనేదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. పిఠాపురంలోనే కాకుండా బయట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాటలు ఇవే. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంతకీ పవన్ కల్యాణ్‌ ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలియట్లేదు. పోనీ పార్టీ వర్గాలకు ఏమైనా తెలుసా అంటే నో ఆన్సర్ అనే అంటున్నారు. మరి ఇంతకీ పవన్ కల్యాణ్‌ ఎక్కడకి వెళ్లినట్టు.. కొందరేమో రష్యాకు వెళ్లిపోయాడని అంటున్నారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 May 2024,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Pithapuram : ఎక్క‌డ‌ కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే.. పత్తాలేని జనసేనాని..!

Pithapuram  : పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ పక్కా గెలుస్తున్నాడు.. కానీ మెజార్టీ ఎంత అనేదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. పిఠాపురంలోనే కాకుండా బయట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాటలు ఇవే. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంతకీ పవన్ కల్యాణ్‌ ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలియట్లేదు. పోనీ పార్టీ వర్గాలకు ఏమైనా తెలుసా అంటే నో ఆన్సర్ అనే అంటున్నారు. మరి ఇంతకీ పవన్ కల్యాణ్‌ ఎక్కడకి వెళ్లినట్టు.. కొందరేమో రష్యాకు వెళ్లిపోయాడని అంటున్నారు. ఇంకొందరేమో హైదరాబాద్ లోనే ఉన్నాడు కావచ్చు అని చెబుతున్నారు.

Pithapuram  ప్రైవేట్ లైఫ్‌ ఉండదు..

చాలామంది వేస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రైవేట్ లైఫ్ ఉండదా అని అడుగుతున్నారు. కానీ పబ్లిక్ లైఫ్‌ లోకి వచ్చాక ప్రైవేట్ లైఫ్‌ ఉండదు. ఎందుకంటే వారు ఎక్కడకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. మీడియా ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఒకవేళ రెస్ట్ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లినా సరే దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అటు జగన్ లండన్ వెళ్లాడని అందరికీ తెలుసు. చంద్రబాబు కూడా అమెరికా వెళ్లారని అందరికీ తెలుసు. కానీ పవన్ కల్యాణ్‌ ఎక్కడున్నాడనేది మాత్రం ఎవరికీ తెలియట్లేదు.

Pithapuram ఎక్క‌డ‌ కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే పత్తాలేని జనసేనాని

Pithapuram : ఎక్క‌డ‌ కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే.. పత్తాలేని జనసేనాని..!

పవన్ కల్యాణ్‌ పిఠాపురంలోనే ఎక్కువగా లేదు. పోలింగ్ కు రెండు రోజుల ముందే అక్కడి నుంచి వచ్చేశాడు. ఇక ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు హెలిక్యాప్టర్ వేసుకుని మంగళగిరికి వచ్చేశాడు. అలాంటిది పిఠాపురంలో ఆయన ఉంటాడా అనేది అనుమానమే. రేపు గెలిచిన తర్వాత ఒకవేళ పిఠాపురంకు వస్తాడేమో అంటున్నారు. పోనీ వచ్చినా సరే ఒక రోజు మాత్రమే ఉంటారు కావచ్చు. మరి ఇప్పుడే పిఠాపురంలో ఉండని పవన్.. రేపు గెలిచిన తర్వాత మాత్రం అక్కడ ఉంటాడని ఎలా నమ్ముతాం అని అక్కడి ప్రజలు అడుగుతున్నారు. ఒకవేళ గెలిస్తే అక్కడ పవన్ కు బదులు వేరే ప్రతినిధిని పెడుతారేమో. ఒకవేళ పవన్ కు సపోర్ట్ చేసిన వర్మను పెడుతారా లేదంటే జనసేన నేతకే అక్కడి బాధ్యతలు అప్పగిస్తారా అనేది వేచి చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది