Jr Ntr Birthday : నందమూరి ఫ్యామిలీ నుండి ముఖ్యమంత్రి కాబోయేది ఈయనే..!
Jr Ntr Birthday : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజలకి చాలా దగ్గరయ్యారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు పేదవారికి చాలా ఉపయోగపడ్డాయి. ఎన్టీఆర్ తన పాలనతో ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. ఇక ఆయన తర్వాత మళ్లీ ఆ ఫ్యామిలీ నుండి ముఖ్యమంత్రిగా పోటీ చేసేవారు లేకుండా పోయారు. బాలయ్య ఉన్నా కూడా అతను ఎంఎల్ఏ స్థానానికే పరిమితం అయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి మాత్రం ముఖ్యమంత్రి అయ్యే సత్తా ఉందని, రానున్న రోజులలో అతను సీఎం కావడం పక్కా అని అందరు చెబుతున్న మాట. తాత నుంచి రూపమే కాదు మాటని కూడా పుణికిపుచ్చుకున్నారు తారక్.
Jr Ntr Birthday తాతకి తగ్గ మనవడు..
ఎన్టీఆర్ తర్వాత అంత అద్భుతమైన వాగ్ధాటితో సంభాషణల్ని పడించగల నేర్పు తారక్ కి వుంది. ఆయన్ని అభిమానుల్లో నిలబెట్టిందే డైలాగ్ డెలివరీ. మాటని, పదాలని ఎంత నొక్కి చెప్పాలి, ఎక్కడ తేలికగా వుండాలి, ఎక్కడ బరువు పెంచాలనే సెన్స్ ని పట్టుకున్న నటుడు తారక్. బ్రీత్ లెస్ డైలాగులని అలవోకగా చెప్పే నేర్పు తారక్ సొంతం. కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద హిట్ కొట్టిన చాలా మంది హీరోలు.. ఆ విజయాన్ని కొనసాగించి కెరీర్ ని మలచుకోవడంలో తడబడిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. ఏ రంగంలోనైన కమ్యునికేషన్ చాలా ముఖ్యం. ఈ విషయంలో తారక్ కి ఫుల్ మార్కులు పడిపోతాయి. బహిరంగ వేదికల్లో కాని, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కానీ తారక్ మాటల్లో చాలా స్పష్టత వుంటుంది. చెప్పే విషయంలో లాగ్ వుండదు. మాట రోల్ అవ్వదు. సూటిగా స్తుత్తి లేకుండా ఒక విషయాన్ని ఎంత వరకూ చెప్పాలో క్లారిటీ వుంటుంది.
తారక్ మాట్లాడితే ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదని, ఎంత కావాలో అంతే తూకం చూసినట్లుగా మాట్లాడుతారని మీడియా సర్కిల్స్ లో చెప్పుకొంటుంటారు. స్పాంటెనిటీలో తారక్‌కు తిరుగులేదు. ఈ లక్షణంతోనే ‘బిగ్ బాస్’ హోస్ట్ అవతారం ఎత్తాడు. తాజా పుట్టిన రోజుతో 41 ఏళ్ళు నిండాయి. సినీ రంగంలో ఉజ్యల భవిష్యత్తు ఉన్న ఎన్టీఆర్ మరో పదేళ్లలో రాజకీయాలలోకి కూడా వచ్చిన తన తాత స్థాయిలో పవర్ చూపించగలడని నలుగురు చెప్పుకుంటున్న మాట. మరో దశాబ్దం తరువాత ఉంటుందని, అది గ్రాండ్ గా ఉంటుందని అంటున్నారు. జూనియర్ కి అప్పటికి యాభై ఏళ్ళు నిండుతాయని ఆయన సినీ జీవితానికి విరామం ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం తప్పక ఉందని అంటున్నారు.