Pawan Kalyan : వారాహి ఖర్చులు అన్నీ వాళ్ళవేనా? ఓరి నాయనో పవన్ కళ్యాణ్ వాళ్ళ కొంప ముంచేసాడుగా..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: June 15, 2023, 12:00 pm

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలు, ఇటు సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరమే సమయం ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. ఆ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే భారీ సెట్ వేసింది మూవీ యూనిట్. ఈ సెట్ లోనే దాదాపు సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఇప్పటికే.. హరిహర వీరమల్లు సినిమా సెట్ కాలిపోయిన విషయం తెలుసు కదా. దాన్ని మళ్లీ పునరుద్ధరించారు.

మరోవైపు ఓజీ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్ వేశారు. ఓజీ సినిమా షూటింగ్ కూడా నడుస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ప్రస్తుతం సెట్ లోనే నడుస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపడుతుండటంతో ఆయన షూటింగ్ షెడ్యూల్స్ లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న సెట్స్ కూడా తీసేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

who is the sponser for pawan kalyan vaarahi

who is the sponser for pawan kalyan vaarahi

Pawan Kalyan : మరి ఈ ఖర్చంతా ఎవరు భరించాలి?

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది అనగా.. ఇప్పుడు సినిమాల షూటింగ్ కి పవన్ బ్రేక్ ఇవ్వాల్సిందే. అందుకే.. పవన కళ్యాణ్ ను కలిసేందుకు ఆయనతో సినిమాలు చేస్తున్న వాళ్లంతా వచ్చారు. ముఖ్యంగా నిర్మాతలు వచ్చి పవన్ తో భేటీ అయ్యారు. వారాహి యాత్ర సందర్భంగా వాళ్లు వచ్చారు. అలాగే.. వారాహి యాత్ర ఎక్కడ జరుగుతుందో.. సినిమాల షూటింగ్ లను కూడా ఆయా ప్రాంతాల్లోనే నిర్వహించాలని నిర్ణయించారట. మంగళగిరి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనే షూటింగ్ కూడా ఏర్పాటు చేయనుండటంతో ఇప్పటి వరకు వేసిన సెట్స్ ను తీసేయనున్నట్టు తెలుస్తోంది. మళ్లీ వారాహి యాత్ర జరిగే ప్రాంతాల్లో సెట్స్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారాహితోనే పవన్ కళ్యాణ్ రోజూ బిజీగా ఉంటారు కదా. మరి.. షూటింగ్ ఎప్పుడు చేస్తారు అనేదానిపై క్లారిటీ రావడం లేదు. చూడాలి.. ఈ భారాన్ని నిర్మాతలు ఎలా మోస్తారో ఏమో?

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp