Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నట్లు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నట్లు..?

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నట్లు..?

Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్‌కు చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చొచ్చుకుపోయినట్టు సమాచారం. వెంటనే స్కూల్ సిబ్బంది అప్రమత్తమై ఆసుపత్రికి తరలించగా అక్కడ అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త వెలుగులోకి రాగానే, పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని తన పర్యటనను ముగించుకుని సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ఎందుకు సింగపూర్‌లో ఉంటున్నాడనే ప్రశ్న జనంలో చర్చనీయాంశంగా మారింది.

Pawan Kalyan Son పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నట్లు

Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నట్లు..?

Pawan Kalyan Son ప్రమాదానికి గురైన పవన్ కుమారుడు..? అసలు ఎందుకు సింగపూర్‌లో ఉన్నాడు..? ఎవరితో ఉన్నాడు..?

మార్క్ శంకర్ సింగపూర్‌లో నివాసం ఉండటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా చదువులే. ఆమె ఇటీవల సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు. చదువు నిమిత్తం ఆమె తన కుమారుడితో కలిసి సింగపూర్‌లో నివసిస్తున్నారు. మార్క్ శంకర్ అక్కడ రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్‌ లో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ స్కూల్‌లో ప్రధానంగా కిచెన్‌లో నిర్వహించే లెసన్లు, ప్రాక్టికల్ శిక్షణలుంటాయి. ఇలాంటి తరహా ప్రత్యేక విద్యా విధానం ఉన్నందునే అన్నా తన కుమారుడిని అక్కడ చదివించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అన్నా లెజ్‌నేవా విద్యార్హతల విషయానికొస్తే, ఆమె సింగపూర్‌లో మాస్టర్స్ పూర్తిచేయకముందు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ యూనివర్శిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్‌లో గౌరవ డిగ్రీ పొందారు. ఆమె ఆసియా దేశాల చరిత్ర, సంస్కృతి, భాషలపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె విద్య కొనసాగించేందుకు సింగపూర్‌ను ఎంచుకున్నారు. అదే సమయంలో కుమారుడికి కూడా అక్కడే మంచి విద్యను అందిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు వ్యక్తిగతంగా కుటుంబాన్ని కలవడానికి సింగపూర్‌ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటనలో తన కుమారుడికి గాయాలయ్యాయనే వార్త తెలియగానే ఆయన వెంటనే అక్కడికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది