Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నట్లు..?
Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్‌కు చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చొచ్చుకుపోయినట్టు సమాచారం. వెంటనే స్కూల్ సిబ్బంది అప్రమత్తమై ఆసుపత్రికి తరలించగా అక్కడ అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త వెలుగులోకి రాగానే, పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని తన పర్యటనను ముగించుకుని సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ఎందుకు సింగపూర్‌లో ఉంటున్నాడనే ప్రశ్న జనంలో చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నట్లు..?
మార్క్ శంకర్ సింగపూర్‌లో నివాసం ఉండటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా చదువులే. ఆమె ఇటీవల సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు. చదువు నిమిత్తం ఆమె తన కుమారుడితో కలిసి సింగపూర్‌లో నివసిస్తున్నారు. మార్క్ శంకర్ అక్కడ రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ స్కూల్‌లో ప్రధానంగా కిచెన్‌లో నిర్వహించే లెసన్లు, ప్రాక్టికల్ శిక్షణలుంటాయి. ఇలాంటి తరహా ప్రత్యేక విద్యా విధానం ఉన్నందునే అన్నా తన కుమారుడిని అక్కడ చదివించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అన్నా లెజ్‌నేవా విద్యార్హతల విషయానికొస్తే, ఆమె సింగపూర్‌లో మాస్టర్స్ పూర్తిచేయకముందు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ యూనివర్శిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్‌లో గౌరవ డిగ్రీ పొందారు. ఆమె ఆసియా దేశాల చరిత్ర, సంస్కృతి, భాషలపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె విద్య కొనసాగించేందుకు సింగపూర్‌ను ఎంచుకున్నారు. అదే సమయంలో కుమారుడికి కూడా అక్కడే మంచి విద్యను అందిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు వ్యక్తిగతంగా కుటుంబాన్ని కలవడానికి సింగపూర్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటనలో తన కుమారుడికి గాయాలయ్యాయనే వార్త తెలియగానే ఆయన వెంటనే అక్కడికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.