Ys Jagan : ఎమ్మెల్సీ దువ్వాడ వివాదం.. జగన్ స్పందించకపోతే ఎలా..?
Ys Jagan : పార్టీ నాయకుడు ఎవరైనా తప్పు చేస్తే మిగతా రాజకీయ పార్టీలన్నీ ఆ పార్టీని టార్గెట్ చేస్తూ ఎటాక్ చేస్తారని తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం సంచలన టాపిక్ గా మారింది. ఇద్దరు కూతుళ్లు ఉండగా మరొక మహిళతో శ్రీనివాస్ ఉండటంపై గొడవ ముదిరింది. పిల్లలు వెళ్లి నాన్న కావాలని అడిగినా అతను వారి మీద, భార్య మీద దుర్భాషలాడటం.. కర్రతో కొట్టే ప్రయత్నం చేయడం చేస్తున్నాడు. ఈ వ్యవహారం […]
ప్రధానాంశాలు:
Ys Jagan : ఎమ్మెల్సీ దువ్వాడ వివాదం.. జగన్ స్పందించకపోతే ఎలా..?
Ys Jagan : పార్టీ నాయకుడు ఎవరైనా తప్పు చేస్తే మిగతా రాజకీయ పార్టీలన్నీ ఆ పార్టీని టార్గెట్ చేస్తూ ఎటాక్ చేస్తారని తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం సంచలన టాపిక్ గా మారింది. ఇద్దరు కూతుళ్లు ఉండగా మరొక మహిళతో శ్రీనివాస్ ఉండటంపై గొడవ ముదిరింది. పిల్లలు వెళ్లి నాన్న కావాలని అడిగినా అతను వారి మీద, భార్య మీద దుర్భాషలాడటం.. కర్రతో కొట్టే ప్రయత్నం చేయడం చేస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా ప్రజలు చూస్తున్నారు. ఆ తర్వాత తన పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా లేకుండా ఇంకా తను చేస్తుంది దాపరికం చేయాలని చూస్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్. ఐతే ఎమ్మెల్సీ వ్యవహారంలో ఇంత జరుగుతున్నా వైసీపీ పార్టీ నుంచి కానీ అధినేత జగన్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. వైఎస్ జగన్ మిగతా విషయాల్లో ఏమో కానీ ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాల మీద స్పందించాలని కొందరు నేతలు కోరుతున్నారు.
Ys Jagan పవన్ వ్యక్తిగత విషయాలపై దువ్వాడ కామెంట్స్..
అంతకుముందు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఇదే దువ్వాడ శ్రీనివాస్ అభ్యంతర కరమైన మాటాలు మాట్లాడాడు. పవన్ 3 పెళ్లిల్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దువ్వాడ కు కర్మ సిద్ధాంతం ప్రకారం అతని కర్మ అనుభవిస్తున్నాడని జనసేన కార్యకర్తలు అతన్ని ఎటాక్ చేస్తున్నారు. పవన్ 3 పెళ్లిల్లు అందరికీ తెలిసే చేసుకున్నాడు. కానీ నువ్వు చేసింది ఏంటి దువ్వాడ అంటూ ఫైర్ అవుతున్నారు.
ఏపీలో ఎక్కడ చూసినా దువ్వాడ ఫ్యామిలీ గొడవ ప్రధాన వార్త కాగా దీనిపై ఎవరు స్పందించకపోవడం విశేషం. జగన్ ఈ విషయంపై ఎంత త్వరగా రెస్పాండ్ అయితే అంత మంచిదని కొందరు చెబుతున్నారు. దువ్వాడ మాత్రమేనా ఇదివరకు అంబటి, గుడివాడ అమర్నాథ్, అవంతి ఇలా వెళ్లకు సంబందించిన ఎఫైర్స్ మ్యాటర్ కూడా అంతకుముందు బయట పడగా అప్పుడు కూడా అవేవి తనకు పట్టనట్టే ఉన్నాడు జగన్. ఇది పార్టీకి పెద్ద డ్యామేజ్ గా మారుతుందనే విషయాన్ని గుర్తించట్లేదు.