Chandrababu : క్రిమినల్ ముఖ్యమంత్రిని ప్రశ్నించినందుకు అరెస్ట్ చేస్తారా? రఘురామకు చంద్రబాబు మద్దతు?
Chandrababu : ప్రస్తుతం ఏపీలో ట్రెండింగ్ టాపిక్ రఘురామకృష్ణంరాజు గురించే. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదే పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు పార్టీ హైకమాండ్ కు, ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు ఎదురు తిరిగారు. అప్పటి నుంచి ఢిల్లీలో మకాం వేసి.. అక్కడే మీడియా సాక్షిగా ప్రతి రోజు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగేవారు. ముఖ్యమంత్రి జగన్ పై రకరకాల ఆరోపణలు చేసేవారు. ఇలా.. రోజూ ఏదో ఒక విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని రఘురామకృష్ణంరాజు ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించేవారు.
తాజాగా.. రఘురామకృష్ణంరాజును ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయంపై ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసి రాత్రి మొత్తం నిద్ర పోనీయకుండా విచారణ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. తనకు బెయిల్ కావాలంటూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తాజాగా రఘురామను కోర్టులో ప్రవేశపెట్టగా.. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని.. తన కాళ్లకు అయిన గాయాలను చూపించారు రఘురామ. తనను పోలీసులు వేధించారని.. చితకబాదారని న్యాయమూర్తికి లేఖ రాశారు రఘురామ కృష్ణంరాజు.
Chandrababu : రఘురామకు మద్దతుగా చంద్రబాబు ట్వీట్లు
ఇదిలా ఉండగా… టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. రఘురామకృష్ణంరాజుకు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఒక క్రిమినల్ ముఖ్యమంత్రిని ప్రశ్నించినందుకు అరెస్ట్ చేస్తున్నారా? ప్రజాస్వామ్యాన్ని మీరు పరిహాసం చేస్తారా? మనిషికి ఉన్న ప్రాథమిక హక్కులకు కూడా భంగం కల్గిస్తారా? అసలు.. ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు మీకెవరిచ్చారు? రఘురామకృష్ణంరాజును ఒక తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఏపీ సీఐడీ ఆఫీసులో టార్చర్ పెట్టారు. అసలు.. మన రాజ్యాంగాన్ని ఇలా ఖూనీ చేస్తుంటే.. అసలు రాజ్యాంగం మీద ప్రజలకు నమ్మకం ఉంటుందా? రాజ్యాంగం ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చారు. ఏది ఏమైనా.. మన రాజ్యాంగం గొప్పది.. మన న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. అవే న్యాయం ఏంటో చెబుతాయి. రాజ్యాంగం విలువలను కాపాడాలని, ప్రజాస్వామ్యం వర్థిల్లాలని నేను కోరుకుంటున్నా.. అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
.@raghuraju_mp was arrested on a foisted case, tortured right in the AP CID office in a barbaric manner. His crime? To question the criminal CM on his anti-people ways. Broad daylight violation of fundamental rights and mockery of democracy. (1/2)#WeAreWithRRR
— N Chandrababu Naidu (@ncbn) May 15, 2021
Trust in our great constitution is put under question. I am sure constitution and judiciary will ensure justice. Pray for safeguarding democracy and upholding our constitutional values. Injustice anywhere is a threat to justice everywhere! (2/2)#WeAreWithRRR
— N Chandrababu Naidu (@ncbn) May 15, 2021