YSRCP : ఆంధ్ర రాజకీయాలలో వైసీపీ గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YSRCP : ఆంధ్ర రాజకీయాలలో వైసీపీ గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి..?

YSRCP : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాగైనా అధికారం సాధించాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి. అయితే మొదట్లో వైసీపీ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలిసిందే. కాని ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ గ్రాఫర్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. రెండు నెలల క్రితం గమనించినట్లయితే వైసీపీ పరిస్థితి ఓటమి పాలవుతుందని చాలామంది భావించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయానికి వైసీపీ పార్టీపై మరింత వ్యతిరేకత వస్తుందని చాలామంది అనుకున్నారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 February 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  YSRCP : ఆంధ్ర రాజకీయాలలో వైసీపీ గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి..?

YSRCP : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాగైనా అధికారం సాధించాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి. అయితే మొదట్లో వైసీపీ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలిసిందే. కాని ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ గ్రాఫర్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. రెండు నెలల క్రితం గమనించినట్లయితే వైసీపీ పరిస్థితి ఓటమి పాలవుతుందని చాలామంది భావించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయానికి వైసీపీ పార్టీపై మరింత వ్యతిరేకత వస్తుందని చాలామంది అనుకున్నారు. వాస్తవానికి అదే జరిగి ఉండాలి కానీ వైసీపీ గ్రాఫ్ పడిపోకుండా అమాంతం పెరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం వైయస్ జగన్మోహన్ రెడ్డిని గద్దే దించాలనే ఆలోచనతో కూటమితో ముందుకు వెళుతున్న ప్రతిపక్షాల మార్గం సరిగా లేకపోవడం అని చెప్పాలి .అయితే వైసీపీ పార్టీని ఒంటరిగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతో టీడీపీ , జనసేన పొత్తు కలిసాయి. ఈ రెండు పార్టీలు పొత్తు కుదరడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కూడా విపరీతంగా పెరిగింది. ఈ తరుణంలో వైసీపీ శ్రేణుల్లో కలవరం కూడా మొదలైంది. అయితే ఇల్లు అలకగానే పండగ కాదన్న సామితే… టీడీపీ జనసేన పొత్తుతో సమన్వయం ప్రధాన సమస్యగా మారింది. అయితే రాజకీయాలలో 2+2=4 కాదని అంటూ ఉంటారు. ఇక టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకోవడంతో అధికారం పై పార్టీ నేతల్లో ఆశలు కూడా చిగురించాయి.

ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య టికెట్ల డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు అదే స్థాయిలో పెరగడం మొదలయ్యాయి. దీంతో ఈ రెండు పార్టీలలో ఒకరికి టికెట్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే కోపం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనికి మంచి ఉదాహరణ రాజమండ్రి రూరల్ సిటీ అని చెప్పాలి.ఎందుకంటే టీడీపీ తో చర్చలు జరుపుకుండానే కందుల దుర్గేష్ కు రాజమండ్రిలో టికెట్ ప్రకటించారు పవన్ కళ్యాణ్ . అయితే అక్కడ అసలేం జరిగింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా రాజోలు మరియు రాజనగరంలో కూడా జనసేన పోటీ చేయబోతుందంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలోని పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారని పవన్ కళ్యాణ్ రీ పబ్లిక్ డే సందర్భంగా తెలియజేసిన విషయం తెలిసిందే.అయితే టీడీపీ మరియు జనసేన అధినేతలు ముందుగా అభ్యర్థులను ప్రకటించకుండానే పార్టీలో లొల్లి ప్రారంభమైంది. దీంతో అధినేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పిన కూడా నేతలు వినిపించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక వైసీపీ అభ్యర్థుల విషయానికొస్తే…అభ్యర్థుల మార్పు చేర్పులు చిన్నచిన్న అలకలు తప్ప సీఎం వైయస్ జగన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపించడం లేదు. ఇక దీనికి గల ప్రధాన కారణం మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సానుకూల వాతావరణమని చెప్పాలి. ఇక టీడీపీ మరియు జనసేన పొత్తులో చాలామంది టికెట్లు గల్లంతూ అవుతున్నాయనే భయం కూడా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. ఇక ఇప్పుడు బీజేపీ కూడా ఈ పొత్తులో తోడవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో నేతలు చాలామంది త్యాగాలకు సిద్ధపడాల్సి వస్తుంది. పోనీ కూటమి అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉంటే వారి నాయకత్వాన్ని పోగొట్టుకొని త్యాగలకు సిద్ధమవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణం బట్టి చూస్తే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి క్రమంలో వైసీపీ ఎన్నికల శంఖారావం భీమిలిలో మొదలుపెట్టి ఇప్పటికే మూడు సభలను పూర్తి చేసింది. ఇక ఇక్కడ వాస్తవంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకదానికి మించి మరొక సభ సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి.దీంతో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడనే బలమైన సంకేతాలు వైసీపీ సిద్ధం సభలు విజయవంతం అవడం ద్వారా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే వైసీపీ పార్టీని వీడిన నేతలు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా పార్టీ వీడి నెల రోజులు కాకుండానే తిరిగి మళ్ళీ పాత గుటికి చేరుకున్నారు.ఇక కూటమిలో సీట్లు టికెట్లు కీచులాట జరుగుతుంటే వైసీపీ మాత్రం సిద్ధం సభలతో సానుకూల వాతావరణంలో దూసుకుపోతుంది. దీంతో జనసేన టీడీపీ బీజేపీ కూటమితో అధికారంలోకి వచ్చేది లేదని భావించిన నేతలు వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది