Kesineni Nani : వైసీపీలో చేరుతాడా.. లేక టీడీపీలోనేనా? క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.. కేశినేని నాని పరిస్థితి ఏంటి?
Kesineni Nani : ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో కేశినేని నాని హాట్ టాపిక్ అయ్యారు. దానికి కారణం.. ఆయన టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి టీడీపీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. అది కాకుండా వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అందుకే విజయవాడ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కేశినేని నాని వ్యవహారంతో చంద్రబాబు తల పట్టుకొని కూర్చున్నారట. ఏం చేయాలో పాలుపోవడం లేదట. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది టీడీపీకి చివరి చాన్స్ అని చెప్పుకోవచ్చు. అందుకే చంద్రబాబు కూడా తొందరపడటం లేదు. ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు.
ఇక.. కేశినేని నాని విషయంలోకి వస్తే.. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎటువైపు ఉంటారు అనే దానిపై క్లారిటీ మాత్రం రావడం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ వైసీపీ హవా నడుస్తోంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పుడు వైసీపీ వైపునకు వెళ్లింది. అందుకే.. ఈసారి ఎలాగైనా ఉమ్మడి కృష్ణా జిల్లాను టీడీపీ వైపునకు తిప్పుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. టీడీపీ నుంచి విజయవాడ నుంచి ఎంపీగా గెలిచిన కేశినేని నాని మాత్రం వైసీపీతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు.ప్రస్తుతం కేశినేని నాని.. మైలవరం, నందిగామ నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారు. వాళ్ల ఈవెంట్స్ కి కూడా వెళ్తున్నారు. దీంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆయన అలా చేయడం వల్ల టీడీపీకి తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
Kesineni Nani : విజయవాడ ఈస్ట్ లేదా వెస్ట్ నియోజకవర్గాలు తన వాళ్లకు ఇవ్వాలని నాని డిమాండ్
అయితే.. కేశినేని అలా చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందట. విజయవాడ ఈస్ట్ లేదా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఒక టికెట్ తమ కుటుంబంలోకి ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతున్నారట. తనకు ఎంపీ టికెట్ తో పాటు ఈస్ట్ ఆర్ వెస్ట్ రెండింట్లో ఒక ఎమ్మెల్యే టికెట్ తన కుటుంబానికి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు వాటికి ఓకే చెప్పకపోతే నాని వెంటనే వైసీపీలోకి జంప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వైసీపీ నుంచి ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే టీడీపీని వదిలేసినా వదిలేస్తారు. అందుకే ఈ విషయంలో చంద్రబాబు ఆచీతూచీ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.