Kesineni Nani : ఎన్ని కేసులు పెట్టిన ఎవ్వరు ఏంచేయలేరంటూ నాని హెచ్చరిక
ప్రధానాంశాలు:
Kesineni Nani : ఎన్ని కేసులు పెట్టిన ఎవ్వరు ఏంచేయలేరంటూ నాని హెచ్చరిక
Kesineni Nani : టీడీపీ నేతల మధ్య పెరిగిన అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవల టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పత్రికలో వచ్చిన ‘కేశినేని నానిపై కేసు నమోదు చేయండి’ అనే కథనాన్ని ట్యాగ్ చేస్తూ నాని “ఎక్స్” వేదికగా తీవ్ర ట్వీట్ చేశారు. తనపై ఎంతటి కేసులు పెట్టినా నిజాన్ని బయటపెట్టడాన్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.

Kesineni Nani : ఎన్ని కేసులు పెట్టిన ఎవ్వరు ఏంచేయలేరంటూ నాని హెచ్చరిక
Kesineni Nani : సోదరుడిపై నాని ఆగ్రహం
నాని చేసిన ట్వీట్‌లో “బాబూ చార్లెస్ రాజ్… నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, పెట్టించినా… నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, దందాలు, దోపిడీ, మోసాలు బయటపెట్టకుండా ఉండే ప్రసక్తే లేదు” అంటూ గట్టిగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో నాని-చిన్నిల మధ్య పెరిగిన విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీ లోపల కూడా ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్ పై టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. కేశినేని నాని పదేపదే పార్టీ మీద విమర్శలు చేస్తుండటంతో, నేతల మధ్య వర్గ పోరు తీవ్రతరం అవుతోంది. కేశినేని చిన్ని ఎంపీగా గెలిచినప్పటికీ, నాని మాత్రం తన మనస్థాపాన్ని బయటపెడుతూ రాజకీయ వేదికలపై విమర్శలు కొనసాగిస్తున్నారు. త్వరలో ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.