Categories: andhra pradeshNews

Sailajanath : ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు : శైలజానాథ్

Advertisement
Published by
Advertisement

Sailajanath : దేశ రాజకీయాల్లో పెను చర్చకు కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు తాజాగా లోక్‌సభలో ఆమోదం పొందింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టగా, అర్ధరాత్రి వరకూ చర్చ కొనసాగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో 282 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఘాటు స్పందన తెలిపింది.

Advertisement

Sailajanath : ముస్లిమ్స్ చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికి మరచిపోరు : శైలజానాథ్

Sailajanath చంద్రబాబుకు ముస్లిమ్స్ గుణపాఠం చెపుతారా..?

వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత శైలజానాథ్ మాట్లాడుతూ.. ముస్లింల హక్కులను కాలరాస్తూ, మైనారిటీలతో ఘోరమైన అన్యాయం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు గతంలో ముస్లిం వర్గానికి ఇచ్చిన హామీలను మరిచిపోయారని, ఇప్పుడు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఆయన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెట్టిందని విమర్శించారు. షర్మిలను తెరపైకి తీసుకురావడం, కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అప్పగించడం వెనుక వక్ఫ్ బిల్లును పక్కదారి పట్టించే ఉద్దేశమే ఉందని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు ధోరణి అని, ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ నిత్యకృత్యమని అన్నారు.

Advertisement

అంతేకాక వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలో ఆమె భాగమైందని శైలజానాథ్ పేర్కొన్నారు. ఈ కుట్రల వెనుక చంద్రబాబు మాస్టర్‌మైండ్‌గా ఉన్నారని, షర్మిల కూడా అదే దిశగా కదులుతున్నారని విమర్శించారు. డబ్బు కోసం పార్టీలు పెట్టి, మూసి వేసే వాళ్లు ప్రజల పక్షాన నిలబడలేరని, ఆమె చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ప్రజలను మోసం చేయలేవని తేల్చి చెప్పారు. మొత్తంగా వక్ఫ్ బిల్లుతో మొదలైన వివాదం రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలించడంతో పాటు, పలు కీలక నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Allu Arjun : రెమ్యునరేషన్ వద్దు.. లాభాల్లో వాటా ముద్దు : అల్లు అర్జున్ ‘ప్రాఫిట్ షేరింగ్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…

1 hour ago

SRH Fan Blackmagic : నిమ్మకాయ + క్షుద్రపూజ .. SRH అభిమాని దొరికాడు .. ఏమన్నాడంటే !

SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…

3 hours ago

Business : వామ్మో పాములతోనే కోట్ల సంపాదన .. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న చైనా మహిళ సాహసం ..!

Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…

4 hours ago

WhatsApp : యూజర్లకు షాక్‌ .. ఇక పై వాట్సప్ వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే..!

WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…

6 hours ago

Gold : అదిరిపోయే ఆఫర్లు .. రూ.1 నుంచే బంగారం కొనుగోలు అవకాశం .. ఎలాగో తెలుసా ..?

Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…

7 hours ago

Mangoes : మామిడి పండ్లు బాగా తింటున్నారా? .. అయితే ఈ విషయాలు తెలుసుకోండి .. లేదంటే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టినట్టే ..!

Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…

9 hours ago

Tea : టీకి ముందు నీళ్లు తాగాలా? .. లేక తాగిన తర్వాతనా? .. అసలు నిజం ఇదే..!

Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…

10 hours ago

Millet Breakfast : ఉదయం అలసటకు చెక్ .. మిల్లెట్స్ బ్రేక్‌ఫాస్ట్‌తో ఇక రోజంతా ఫుల్ ఎనర్జీ..!

Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…

12 hours ago

BPCL : నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం .. నెలకు రూ.1,40,000 వరకు వేతనంతో ఉద్యోగాలు .. వివరాలివే ..!

BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…

21 hours ago

Aadhaar Card : ఆధార్ అప్‌డేట్‌పై యూఐడీఏఐ కీలక ప్రకటన .. జూన్‌ 14 వరకే గడువు..!

Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…

22 hours ago

PM Modi : బెంగాల్‌లో మోడీ స్ట్రాటజీ .. సెంటిమెంట్‌తో సింపుల్ సర్‌ప్రైజ్ ..!

PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…

24 hours ago

Samantha : నేను తప్పు చేయలేదు .. చైతూతో పెళ్ళికి 100 శాతం న్యాయం చేశా .. విడాకులకు కారణం అదే .. ?

Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది.…

1 day ago