Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!
ప్రధానాంశాలు:
ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు - లోకేష్
Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. రేపో మాపో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈ మెయిల్ చేశారని తెలిపారు. మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ ఈ మెయిళ్లు పెట్టారని వివరించారు. వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ సంస్థతో మురళీకృష్ణకు సంబంధమున్నట్లు తెలిసిందన్నారు. ఇదే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని ఆయన అభివర్ణించారు.

Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!
Nara Lokesh : ఏపీలో ప్రభుత్వం మారుతుందంటూ సింగపూర్ అధికారులకు వైసీపీ నేత మెయిల్
ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ బ్రాండ్‌ను తిరిగి సాధించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు రానున్నాయని తెలిపారు. ఆ క్రమంలో రాష్ట్రంలో టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు కానుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి.. అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణపై దృష్టి సారించినట్లు వివరించారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయన తర్వాత ఏపీకి బ్రాండ్ తిరిగొచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ హయాంలో ఏకపక్షంగా సింగపూర్ ఒప్పందాలు రద్దు చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో సింగపూర్ ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేశారని గుర్తు చేశా
రాజధాని అమరావతి సంయుక్త అభివృద్ధికి సింగపూర్ అంగీకారం తెలిపిందన్నారు. సింగపూర్ పర్యటనలో రూ. 45 వేల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. సింగపూర్‌లో నాలుగు రోజుల్లో సీఎం చంద్రబాబు 26 మీటింగ్స్ నిర్వహించారని వివరించారు. 19 వన్ టూ వన్ మీటింగ్స్‌లో తాను సైతం పాల్గొన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్, డేటా సెంటర్స్ ఏర్పాటుకానున్నాయని చెప్పారు. విశాఖను ఐటీ పటంలో పెట్టాలని తాము నిర్ణయించామని తెలిపారు. టీసీఎస్‌కు రూ.99 పైసల చొప్పున భూమి కేటాయించామని మంత్రి నారా లోకేష్ వివరించారు.