Perni Nani : పేర్ని నాని రిటైర్ అయితే బందరులో జరిగేది ఇదే..!
Perni Nani : వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మచిలీపట్నం సభలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. బందర్ పోర్ట్ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయగా.. దానికి సంబంధించిన సభలో మాట్లాడిన పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి సీఎం జగన్ తో కలిసి ఏ సభలో పాల్గొనే అవకాశం తనకు ఉండకపోవచ్చని.. అందుకే తాను ఇంత సేపు మాట్లాడుతున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈసందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ఆయన నాకంటే వయసులో చిన్నవారు. లేకపోతే నేను ఆయనకు పాదాభివందనం చేసి ఉండేవాడిని. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకొచ్చారు. సీఎం జగన్ కు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఆయన ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారు. ఆయన ఏదో ఒక సంక్షేమాన్ని అందిస్తూనే ఉంటారు.. అంటూ పేర్ని నాని అన్నారు.
Perni Nani : వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను
వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. నేను ఇక రాజకీయాల్లో తప్పుకున్నట్టే. తన వారసుడినే దించుతాను అని చాలా సార్లు పేర్ని నాని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మచిలీపట్నం వేదికగా పేర్ని నాని.. సీఎం జగన్ ముందే రాజకీయాలకు తన రిటైర్ మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కొడుకు కృష్ణమూర్తి ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈనేపథ్యంలో పేర్ని నానికి బదులు వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.