Prashanth Kishore : ఇది ప్రశాంత్ కిషోర్ దెబ్బ అంటే.. టీడీపీలోకి క్యూ కట్టిన వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు.. షాక్ లో జగన్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prashanth Kishore : ఇది ప్రశాంత్ కిషోర్ దెబ్బ అంటే.. టీడీపీలోకి క్యూ కట్టిన వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు.. షాక్ లో జగన్?

 Authored By kranthi | The Telugu News | Updated on :24 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  టీడీపీలో ప్రశాంత్ కిషోర్ అడుగు పెట్టగానే వైసీపీకి షాక్

  •  ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో టీడీపీలో కొత్త ఊపు

  •  వైసీపీ తన కంట్లో తానే పొడుచుకుంటోందా?

Prashanth Kishore : గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఏపీలో ప్రశాంత్ కిషోర్ గురించే చర్చ నడుస్తోంది. దానికి కారణం.. ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఇద్దరూ కలిసి ఒకే విమానంలో విజయవాడకు రావడం.. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబుతో భేటీ కావడం అన్నీ చూశాం. గత ఎన్నికల్లో వైసీపీకి పని చేసిన ప్రశాంత్ కిషోర్.. వైసీపీ గెలిచిన తర్వాత వైసీపీకి దూరం అయ్యారు. వైసీపీకి దూరం అయిన తర్వాత మళ్లీ వైసీపీతో టచ్ లోకి రాలేదు. ఈసారి ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయమే ఉన్నా.. ఈసారి ప్రశాంత్ కిషోర్ టీమ్ తో వైసీపీ టైఅప్ పెట్టుకోలేదు. దీన్నే చాన్స్ గా తీసుకొని వెంటనే ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ అయి.. టీడీపీ గెలుపు కోసం పని చేయాల్సిందిగా కోరారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ టీమ్ టీడీపీతో టైఅప్ అయినట్టే. వ్యూహాలు కూడా రచిస్తున్నారు. అవి వర్కవుట్ కూడా అవుతున్నట్టు తెలుస్తోంది.

గెలవడం కోసం ఏ పార్టీ అయినా ఎన్ని జిమ్మిక్కులు ప్రదర్శించడానికి కూడా రెడీగా ఉంటాయి. అందుకే ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ రౌడీ అన్న చంద్రబాబే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో టైఅప్ అయ్యారు. అవన్నీ ప్రశాంత్ కు కూడా తెలుసు. మరోవైపు వైసీపీలో ఇన్ చార్జీలను మార్చడం టీడీపీకి ప్లస్ అయింది. అయితే.. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ ఊరికే కలవలేదట. వైసీపీలో అసంతృప్తితో ఉన్న నాయకుల లిస్ట్ ను చంద్రబాబుకు అందించారట. వాళ్లు ఇప్పటికే ప్రశాంత్ తో టచ్ లో ఉన్నారట. వాళ్లంతా ప్రశాంత్ కు టచ్ లోకి రావడంతో ఆ లిస్టును చంద్రబాబుకు అందించారట ప్రశాంత్ కిషోర్.

Prashanth Kishore : అసంతృప్తి ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్?

చంద్రబాబు కూడా ఆ లిస్టును చూసి వాళ్లు పార్టీలోకి రావడానికి మంచి ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారట. వాళ్లు పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే టికెట్లు కొందరికి, పార్టీ గెలిస్తే వేరే పదవులు ఇచ్చేందుకు హామీ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. వాళ్లంతా ఒకవేళ టీడీపీలోకి వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా వైసీపీకి పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది