Vijayasai Reddy : వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలవబోయేది ఈ పార్టీనే.. విజయసాయిరెడ్డి చెప్పేశాడు.. ఆ పార్టీలు 2029 కి ట్రై చేసుకోవాల్సిందేనా?
Vijayasai Reddy : వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలువబోతుంది. అది అందరికీ సస్పెన్సే. 2024 ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడే పార్టీలు మూడే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన. ఈ మూడు పార్టీలో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం అవుతున్నాయి. రెండో చాన్స్ అంటూ అధికార వైసీపీ, చివరి చాన్స్ అంటూ ప్రతిపక్ష టీడీపీ, ఒక్క చాన్స్ అంటూ జనసేన పార్టీ ఈ మూడు ప్రజల్లోకి వెళ్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు యాక్టివ్ లోనే ఉన్నా అంతగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే చాన్స్ అయితే లేదు. అందుకే… ఈ మూడు పార్టీల్లోనే ఏది గెలువబోతోంది. ఏది ప్రతిపక్షంలో ఉండబోతోంది అనేది తేల్చుకోవాలి.
అయితే.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలువబోతోంది. ఏ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఏ పార్టీని గెలిపిస్తున్నారు. ఏ పార్టీ రెండో స్థానంలో ఉండబోతోంది.. అనే విషయాలపై ఇప్పటికే పలు పార్టీలు సర్వేలు చేయించుకున్నాయి. ఇంకా చేయించుకుంటున్నాయి. అధికార వైసీపీ మాత్రం పీకే టీమ్ తో వర్క్ చేయించుకుంటోంది. పీకే టీమ్ కూడా ఎన్నికల కోసం యాక్టివ్ అయింది. సోషల్ మీడియాను కూడా వైసీపీ బాగానే ఉపయోగించుకుంటోంది. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చేశారు. ఒకే ఒక్క ట్వీట్ తో మ్యాటర్ మొత్తం తేల్చేశారు.
Vijayasai Reddy : రెండో స్థానంలో ఎవరు ఉంటారో డిసైడ్ చేసుకోండి?
తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. 2024 ఎన్నికల్లో రెండో పొజిషన్ కోసం టఫ్ ఫైట్ జరగబోతోంది. దానికి కారణం.. టీడీపీకి నిజాయితీగా ఉండే కొందరు ఓటర్లు జనసేనకు షిఫ్ట్ అవబోతున్నారు. అలాగే.. జనసేనకు చెందిన కొందరు ఓటర్లు బీజేపీకి షిఫ్ట్ అవబోతున్నారు. అందుకే.. రెండో స్థానంలో ఎవరు ఉండాలో.. ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉండాలో ముందే డిసైడ్ చేసుకోండి. 2029 ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేసుకోండి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో 51 శాతం కంటే ఎక్కువ ఓట్లతో వైఎస్సార్సీపీ రెండో సారి విజయకేతనం ఎగురవేయబోతోంది.. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అసలు ఏ నమ్మకంతో విజయసాయిరెడ్డి ఇంత ధైర్యంగా వైసీపీ రెండోసారి అధికారంలోకి రాబోతోందని అంటున్నారు అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు.
https://youtu.be/pmlomCV10b4