Ys Jagan : జగన్ కు కోలులేని దెబ్బ తగలబోతుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : జగన్ కు కోలులేని దెబ్బ తగలబోతుందా..?

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2025,6:20 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : జగన్ కు కోలులేని దెబ్బ తగలబోతుందా..?

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస పరాజయాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వదిలి ఇతర పార్టీలలో చేరుతుండగా, ఇప్పుడు మరో కీలక నేత వైసీపీకి గుడ్‌బై చెప్పే సంకేతాలు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Ys Jagan జగన్ కు కోలులేని దెబ్బ తగలబోతుందా

Ys Jagan : జగన్ కు కోలులేని దెబ్బ తగలబోతుందా..?

Ys Jagan : జగన్ కు మరో అత్యంత దగ్గరి వ్యక్తి దూరం కాబోతున్నాడా..?

జక్కంపూడి కుటుంబానికి వైఎస్ కుటుంబంతో ఆత్మీయ సంబంధాలున్నా కూడా, జక్కంపూడి గణేష్‌కి పార్టీ నాయకత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న అభిప్రాయం ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఓ నేత పెత్తనం పెరిగిపోవడంతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని, ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని గణేష్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో ప్రెస్‌మీట్‌ పెట్టి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు.

జక్కంపూడి గణేష్ వైసీపీని వీడితే, జక్కంపూడి రాజాకు అది తీవ్రంగా నష్టంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన రాజా, ఇప్పుడు కుటుంబంలోని మరో కీలక వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోతే రాజకీయంగా మరింత ఒత్తిడికి లోనవుతారు. ఈ పరిణామాలతో వైసీపీకి తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రెస్‌మీట్‌లో గణేష్ ఏమి వెల్లడించబోతున్నారో ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది