Ys Jagan : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ వైఎస్ జగన్ పాలనకు అరుదైన గుర్తింపు లభించింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ” స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్టు 2023లో ఆంధ్ర రాష్ట్రం మన దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. అయితే దానికి ముందు అంటే గత ఏడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు 3వ స్థానానికి ఎదిగింది.దీంతో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వానికి అరుదైన గౌరవం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ పాలనకు జాతీయస్థాయి గుర్తింపు లభించడం జరిగింది. దేశం మొత్తంలో సుపరిపాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వం మూడో స్థానంలో నిలిచింది. అయితే ఇంతకుముందేన్నడు ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన సంస్కరణలను అమలు చేస్తోంది.అంతేకాక ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లేలా జగన్ చేశారు.గ్రామ సచివాలయాలు , వాలంటీర్లు ఇంటి వద్దకే రేషన్ మరియు పెన్షన్ వంటి పథకాల అమలుతో దేశం మొత్తంలో 29 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం దక్కించుకుంది. అయితే ప్రభుత్వ సుపరిపాలన మరియు గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్ర రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని దీనిలో భాగంగానే ఆంధ్ర రాష్ట్రానికి గ్రామీణ అభివృద్ధి , గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది.అయితే దేశం మొత్తంలో పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ” స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2023లో ఆంధ్ర రాష్ట్రానికి మూడవ స్థానం లభించింది. అయితే దానికి ముందు ఏడాది నాలుగో స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు మూడో స్థానానికి రావడంతో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు అరుదైన గౌరవం దక్కింది.మరి ముఖ్యంగా గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందు ఆలోచనతో తీసుకొచ్చినటువంటి మార్పులు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి అని చెప్పాలి.
పారదర్శక పాలన ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలు వంటి అంశాలతో ఆంధ్ర రాష్ట్ర గ్రామీణాభివృద్ధి విజయవంతమైన ఫలితాలను సాధించింది. దీంతో ఈ అరుధైన గౌరవం జగన్ ప్రభుత్వం ఖాతాలో పడింది.అంతే కాక స్కోచ్ సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం సుపరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం మినహా దక్షిణాది రాష్ట్రాలలో మరే రాష్ట్రం కూడా ఈ గుర్తింపు సాధించలేకపోయాయి. ఇక ఈ అరుదైన గుర్తింపు సాధించిన స్థానాలలో మొదటి స్థానం ఒడిస్సా, 2వ స్థానం ఉత్తర ప్రదేశ్ , 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ , 4వ స్థానంలో మహారాష్ట్ర , 5వ స్థానంలో గుజరాత్ నిలిచాయి. అయితే ప్రస్తుతం ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వం పై ఆయన పాలనపై చేస్తున్న విమర్శలకు ఈ అవార్డు సమాధానంగా నిలిచింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు సాధించడం వైసిపి ప్రభుత్వానికి కలిసివచ్చే అంశంగా మారబోతుందని పలువురు అంటున్నారు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.