Ys Jagan Birthday : జ‌గ‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. ముదురు కాదు మ‌హా మ‌దురు.. వైఎస్ జగన్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan Birthday : జ‌గ‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. ముదురు కాదు మ‌హా మ‌దురు.. వైఎస్ జగన్ !

 Authored By ramu | The Telugu News | Updated on :21 December 2024,11:02 am

ప్రధానాంశాలు:

  •  Ys jagan Birthday : జ‌గ‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. ముదురు కాదు మ‌హా మ‌దురు.. వైఎస్ జగన్ !

Ys jagan Birthday : జ‌గ‌న్.. birthday special story ఈ పేరు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసి.. భారీ విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1972 డిసెంబర్ 21న జన్మించిన ఆయన చిన్న వయస్సులోనే ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయినా తిరిగి ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Ys jagan Birthday జ‌గ‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్ ముదురు కాదు మ‌హా మ‌దురు వైఎస్ జగన్

Ys jagan Birthday : జ‌గ‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. ముదురు కాదు మ‌హా మ‌దురు.. వైఎస్ జగన్ !

Ys jagan Birthday యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్..

అయితే జ‌గ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు చూస్తే.. కాంగ్రెస్‌తో విభేదించి బయటకు వచ్చి 2011సొంతంగా వైఎస్సార్సీపీని స్థాపించారు. తనతోపాటు వచ్చిన 17 మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకున్నారు. అప్పుడే దేశవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి పేరు మారుమోగిపోయింది. కానీ అప్పటి నుంచి రాజకీయంగా జగన్‌ను దెబ్బ తీసేందుకు కేసులు తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ఆస్తులపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వేరే వాళ్ల అయితే రాజకీయాలను వదిలేసి దూరంగా వెళ్లిపోయేవారు. కానీ అక్కడ ఉన్నది జగన్. మొండివాడు. ఎక్కడ వెనక్కి తగ్గకుండా ధైర్యంగా కేసులు ఎదుర్కొన్నారు. 2012లో సిబిఐ అక్రమాస్తుల కేసులు జగన్ ను అరెస్టు చేసింది. 16 నెలల పాటు జైల్లో ఉంచింది. జగన్ లేకపోయినా విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకుని పార్టీని నడిపించారు. అన్నకు అండగా షర్మిల నిలిచారు. 2014 ఎన్నిక‌ల‌లో బ‌రిలో నిలిచారు జ‌గ‌న్. 2014 ఎన్నికల్లో కచ్చితంగా జగన్ విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా అప్పటికే క్రేజ్‌ ఉన్న ప్రధాని మోదీతో చంద్రబాబు జత కలవడం.. అప్పుడే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్‌ వీరికి సపోర్ట్ చేయడంతో జగన్‌ అప్పుడు అధికారానికి దూరమయ్యారు. ప్రతిపక్షనేతగా ఐదేళ్లు ప్రభుత్వంపై పోరాడారు.

2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ టీమ్‌ సలహాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి జనాల్లోకి దూసుకువెళ్లారు. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి.. ఇచ్ఛాపురం వరకు 3648 కి.మీ. నడిచి.. దాదాపు 2 కోట్ల మందిని కలిశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి వీడిపోయి సొంతంగా పోటీ చేశాయి. ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా మారుమోగిపోయేలా ఏకంగా 151 సీట్లు సాధించారు. 2019 మే 30న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.వైసిపి ఐదేళ్ల పాలనలో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. నవరత్నాల్లో వీలైనంతవరకు పథకాలు అమలు చేయగలిగారు. అయితే మూడు రాజధానుల అంశం తెరపైకి రావడం.. అమరావతిని నిర్వీర్యం చేయడం.. అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఉండేది. అయితేప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నాం కాబట్టి.. వారంతా మరోసారి ఆశీర్వదిస్తారని జగన్ భావించారు. కాని దారుణ‌మైన ఓట‌మి చ‌వి చూడాల్సి వ‌చ్చింది. ఇప్పుడు జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి సారించారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది