Ys Jagan : జ‌గన్ ఆశ‌ల‌పై చంద్ర‌బాబు మెల్ల‌మెల్ల‌గా నీళ్లు చ‌ల్లుతున్నాడేంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : జ‌గన్ ఆశ‌ల‌పై చంద్ర‌బాబు మెల్ల‌మెల్ల‌గా నీళ్లు చ‌ల్లుతున్నాడేంటి ?

 Authored By ramu | The Telugu News | Updated on :16 December 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : జ‌గన్ ఆశ‌ల‌పై చంద్ర‌బాబు మెల్ల‌మెల్ల‌గా నీళ్లు చ‌ల్లుతున్నాడేంటి ?

Ys Jagan : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది. వైసీపీ దారుణంగా ప‌రాజ‌యం పాలైంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌లో మంచి విజ‌యం సాధించాల‌ని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలో జోరు పెంచారు. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆరు మాసాల్లోనే స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. కూట‌మి స‌ర్కారుకు ప్ర‌జ‌లు బుద్ధి చెబుతార‌ని కూడా ఆయ‌న అంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును తీసుకువ‌చ్చింది. ఇప్ప‌టికే కేంద్రం కూడా దీనికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనిని పార్ల‌మెంటులో ఆమోదించుకుని.. రాజ్యాంగానికి కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేసి.. ఈ బిల్లును ఆమోదించుకుంటే దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌కూ ఒకే సారి ఎన్నిక‌లు వ‌స్తాయి.

Ys Jagan జ‌గన్ ఆశ‌ల‌పై చంద్ర‌బాబు మెల్ల‌మెల్ల‌గా నీళ్లు చ‌ల్లుతున్నాడేంటి

Ys Jagan : జ‌గన్ ఆశ‌ల‌పై చంద్ర‌బాబు మెల్ల‌మెల్ల‌గా నీళ్లు చ‌ల్లుతున్నాడేంటి ?

Ys Jagan జ‌మిలిపైనే ఆశ‌లు..

ఏపీలో ప్రస్తుతం మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిల్లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమిలో బీజేపీ ఉన్నా.. ఓట్లు, సీట్లు మాత్రం ఈ రెండు పార్టీల కంటే తక్కువే. మరోవైపు వైసీపీ ఉంది. వైసీపీ సింగిల్‌ పోటీ చేసి 2019లో ఘనవిజయం సాధించింది. 2024లో మాత్రం ఊహించని స్థాయిలో పరాజయం పాలైంది. ఓటమి తర్వాత కొన్నిరోజులు కామ్‌గా ఉన్న వైసీపీ నేతలు.. ఇటీవల యాక్టివ్ అయ్యారు. జమిలి ప్రకటనలపై ఆశగా ఎదురుచూస్తున్నారు.జమిలి ఎన్నికలు జరిగితే.. వైసీపీకే లాభం అని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్‌ జగన్ సమావేశం అయ్యారు. జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మనం సన్నద్ధంగా ఉంటామని పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌నే జ‌గ‌న్ రోడ్డు మీద‌కు వ‌స్తున్నార‌ని.. త‌మ‌ను కూడా ర‌మ్మంటున్నార‌ని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ విష‌యం వైసీపీలోనూ చ‌ర్చ‌గానే మారింది. మొత్తంగా జ‌గ‌న్ ఆశ‌లు ఇప్పుడు జ‌మిలిపైనే ఉన్నాయి. వ‌చ్చే నాలుగున్న‌రేళ్ల పాటు ఆయ‌న సైలెంట్‌గా ఉండే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలో జ‌మిలికి అనుకూలంగా వైసీపీ ఎంపీలు కూడా మ‌ద్ద‌తు తెల‌ప‌నున్నారు. ఈ ఎన్నిక‌లు వ‌స్తే.. ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావాల‌న్న‌ది జ‌గ‌న్ తాలూకు ఆలోచ‌న‌గా ఉంది. కాని చంద్ర‌బాబు మాత్రం ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా మాదే అధికారం అని అంటున్నారు. ఒకవేళ బీజేపీ అనుకున్నట్టు జరిగితే.. 2027 మార్చి తర్వాత ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి ఇలానే ఉంటుందా అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది