YS Jagan : నెల్లూరులో రాజకీయాన్ని మార్చేసిన వై.యస్ జగన్… కంగుతిన్న కూటమి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : నెల్లూరులో రాజకీయాన్ని మార్చేసిన వై.యస్ జగన్… కంగుతిన్న కూటమి…!

YS Jagan  : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఎన్నికలకు మరో 45 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలు కూడా కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇక రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలను రచిస్తూ ముందడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ భారీ బహిరంగ సభలను ప్రారంభించి […]

 Authored By tech | The Telugu News | Updated on :4 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  YS Jagan : నెల్లూరులో రాజకీయాన్ని మార్చేసిన వై.యస్ జగన్... కంగుతిన్న కూటమి...!

YS Jagan  : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఎన్నికలకు మరో 45 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలు కూడా కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇక రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలను రచిస్తూ ముందడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ భారీ బహిరంగ సభలను ప్రారంభించి ఎన్నికల రంగంలో దూసుకుపోతున్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తుంటే టీడీపీ మరియు జనసేన పొత్తుగా కలిసి పోటీచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కూటమిగా ఏర్పడిన జనసేన టీడీపీ మొదటి అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసింది. అయితే జగన్ మాత్రం ఇప్పటికే అన్నిచోట్ల జాబితాలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరు లోక్ సభ స్థానానికి ఎంపీ గా విజయ్ సాయి రెడ్డిని సమన్వయకర్తగా జగన్ ప్రకటించి టీడీపీ ఆశలపై నీళ్లు కుమ్మరించారని చెప్పాలి. ఇక ఇప్పుడు జగన్ ఈ విధంగా ప్రకటించడంతో నెల్లూరులో వైసీపీ పార్టీ క్లీన్ స్వీవ్ కనిపిస్తుందని అందరూ భావిస్తున్నారు.

అయితే ఆంధ్ర రాజకీయాల్లో నెల్లూరు అనేది చాలా కీలకమైన స్థానం అని చెప్పాలి. ఇక ఇక్కడ వైసీపీ పార్టీకి గట్టి పట్టు ఉంది. గత ఎన్నికల్లో కూడా నెల్లూరులో వైసీపీ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించగలిగింది. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నెల్లూరు రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా మార్పులు చేటు చేసుకుంటున్నాయి. అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి ముఖ్య నేతలైన ఆనం రామ నారాయణరెడ్డి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల పార్టీని వేడి వెళ్లిపోయారు. అదేవిధంగా ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ పార్టీ నుంచి బయటకు వెళ్లడం జరిగింది. ఇక నెల్లూరులో వైసీపీ పార్టీ కీలక నేతలందరూ బయటకు వెళ్లడంతో క్యాడర్ లో కాస్త ఆందోళన మొదలైంది. కీలక నాయకులు పార్టీని వీడడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఎవరు ఊహించని విధంగా వై.యస్ జగన్ నెల్లూరు నుండి వైసీపీ లోక్ సభ అభ్యర్థిగా విజయ సాయిరెడ్డిని ప్రకటించి హై వోల్టేజ్ క్రియేట్ చేశారు. అయితే విజయ్ సాయి రెడ్డి పేరును తన సొంత జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ప్రకటించడంతో ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యమైన నేతలందరూ పార్టీని వీడి వెళ్లిపోయిన నేపథ్యంలో నెల్లూరులో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించాలంటే విజయ్ సాయి రెడ్డి లాంటి వ్యక్తులు అక్కడ పోటీ చేస్తేనే బాగుంటుందని భావించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై వైసీపీ క్యాడర్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూటమి నేతలలో ఆందోళన మొదలైంది అని చెప్పాలి. జగన్ దెబ్బకు రాజకీయ పండితులు కూడా బిక్క మొఖం వేసుకొని చూస్తున్నారని చెప్పాలి.మరి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది