
YS Jagan : లక లక చంద్రముఖి వచ్చేసింది... సిద్ధం సభలో జగన్ ఫన్నీ కామెంట్స్...!
YS Jagan : ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారాలను మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధం సభ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఇక ఈ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ను ఉద్దేశించి పలు రకాల కామెంట్స్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభకు విచ్చేసిన వారందరిని చంద్రముఖి సినిమా చూశారా అని అడిగాడు. ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ గుర్తు పైన నొక్కితే , గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టిలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదు అంటూ తెలియజేశారు. చంద్రగ్రహణాలు ఉండవు అని చెప్పారు. లేకుంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ ఇంటింటికి వచ్చి అబద్దాలతో మోసాలతో మీ తలుపు తడుతుంది అని ఎద్దెవా చేశారు. అందుకే గడపగడపకు కూడా ప్రతి అక్క చెల్లికి కూడా ప్రతి అన్నదమ్ములకి కూడా ప్రతి అవ్వ తాతలకు కూడా చెప్పండి అంటూ సీఎం జగన్ ప్రస్తావించారు.
ఇక్కడ మరో విషయం కూడా ప్రజలు గమనించాలి…14 సంవత్సరాలు సీఎంగా అధికారంలో ఉన్నా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చెప్పుకునేంత ఏం పనులు జరగలేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు జిత్తులు నక్కజిత్తుగా సాగుతుందని సభ పూర్వకంగా జగన్ తెలియజేశారు.14 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి నేను ఇది చేశా అందుకే నాకు ఓటు వేయండి అని చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి వారి రాజకీయాలని పొత్తులు జిత్తులతో సాగుతుంది అంటూ జగన్ తేలియజేశారు. ఈమధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నారు. వెన్నుపోటు పొడిచేది ఆయనే మళ్లీ ఎన్నికల సమయంలో తిరిగి ఎన్టీ రామారావు గారిని గుర్తుతెచ్చుకునేది కూడా ఆయనే. ఇక ఈ మధ్యకాలంలో ఆయన ఒక మాట అంటున్నాడు . తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని పిలుస్తా ఉన్నాడు. అయితే చంద్రబాబు పిలిచేది ప్రజల్ని కాదని పార్టీలను పిలిచి పొత్తు కలుపుకోవడానికని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
దత్తపుత్రుడు కి నేను ఇచ్చే ప్యాకెజీ కోసం రా కదలిరా అని పిలుస్తా ఉన్నాడు.వదినమ్మ ను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా రెండుగా విభజించిన ఈ ద్రోహులను వైయస్సార్ మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా చాట్ సీట్లు లో పెట్టిన నమ్మకద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీలిన పర్లేదు రా కదలిరా అని అందరిని పిలుస్తా ఉన్నాడు. అసలు దత్త పుత్రుడికి చంద్రబాబు కి వదినమ్మ కి చంద్రబాబు మొత్తం టీం కి ఆంధ్ర రాష్ట్రం తో అసలు సంబంధమే లేదు. వీరిలో ఏ ఒక్కరు కూడా మన రాష్ట్రంలో ఉండరు అని ఆయన తెలియజేశారు.ఇక వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని ఈ సందర్భంగా జగన్ తెలియజేశారు. దీంతో ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.