
Ys Jagan : పవన్ కళ్యాణ్‌ని మరోసారి టార్గెట్ చేసిన వైఎస్ జగన్.. బాబు సంకలో పిల్లి అంటూ నాన్‌స్టాప్ పంచ్‌లు..!
Ys Jagan : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత వేడెక్కుతుంది. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ కూడా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర 18వ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగగా, అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . కులాన్ని హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేయగలననే భ్రమలో పవన్ ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. … పవన్ కు ఎన్ని టిక్కెట్లు ఇవ్వాలో, ఎక్కడెక్కడ ఇవ్వాలో, ఆయాస్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలో, ఆఖరికి దత్తపుత్రుడు కూడా ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే ఫిక్స్ చేసిన కూటమి ఇదంటూ జగన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో పవన్ ఉన్నారని అన్నారు. 80 సీట్లు కాదు.. 20 సీట్లు ఇస్తామన్నా కూడా జీ హుజూర్ అని దత్తపుత్రుడు అనాల్సిందే. ఒకవైపు రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే… మరోవైపు కులాన్ని హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేయగలనన్న భ్రమతో పవన్ కల్యాణ్ చెత్త రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. పవన్ కు రాష్ట్రం అంతే ఎంతచులకనంటే అతడికి జ్వరం వస్తే పిఠాపురాన్ని వదలి హైదరాబాద్ వెళ్లిపోయేటంత చులకన అని జగన్ అన్నారు. గతంలో వన్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక అనే మూడు నియోజకవర్గాలుంటే.. ఇప్పుడు పిఠాపురం నాలుగోదని చెప్పిన జగన్… ఈ మ్యారేజీ స్టార్ కు ఏ ప్రాంతమన్నా ప్రేమ ఉండదు, ఏ భార్య అన్నా ప్రేమ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ys Jagan : పవన్ కళ్యాణ్‌ని మరోసారి టార్గెట్ చేసిన వైఎస్ జగన్.. బాబు సంకలో పిల్లి అంటూ నాన్‌స్టాప్ పంచ్‌లు..!
పెళ్లిల్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగేసి అయ్యాయని మరోసారి పవన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి విమర్శలు గుప్పించారు. పెళ్లికి పిఠాపురం వెళ్తూ పిల్లిని చంకనపెట్టుకుని వెళ్లాడని ఒక సామెత ఉంది.. చంద్రబాబు తన సంకలో ఉన్న పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వాదిలాడని.. ఇది గాజు గ్లాసు పరిస్థితి అని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గాజు గ్లాసులో గట గట తాగేది చంద్రబాబు, దానిని కడిగి శుభ్రం చేసి ఇచ్చేది పవన్ కళ్యాణ్ అని జగన్ అన్నారు. మరి జగన్ చేసిన ఈ విమర్శలకి పవన్ కళ్యాణ్ ఏ రేంజ్‌లో స్పందిస్తాడా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.